sisodiya
-
పోలవరం : మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, జంగారెడ్డిగూడెం/పశ్చిమగోదావరి : పోలవరం పునరావాస ప్యాకేజీ (రిలీఫ్ అండ్ రిహబిలిటేషన్) లో అవినీతికి సహకరించారనే ఆరోపణలతో మరో అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శాంతిశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఏపీ సోషల్ వెల్ఫేర్ పిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ప్రకటించారు. జంగారెడ్డి గూడెం మండలంలోని తాడువాయి, చల్లవారి గూడెం, మంగిశెట్టి గూడెం గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో శాంతిశ్వరరావు అవినీతికి సహకరించినట్టు నిరూపణ అయిందని తెలిపారు. సుమారు 1200 వందల ఎకరాల భూసేకరణలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆర్ అండ్ ఆర్‌లో అవినీతి జరిగిందంటూ సాక్షి టీవీలో వెలువడిన పలు కథనాలకు అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
ఢిల్లీలో ముగ్గురు చిన్నారుల ఆకలిచావు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆకలిచావులు వెలుగుచూశాయి. సరైన ఆహారం అందక ఢిల్లీలో రెండేళ్లు, నాలుగేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలుకోల్పోయిన ఘటన ఢిల్లీలో చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని మండావలి ప్రాంతానికి చెందిన ఓ తల్లి తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న తన ముగ్గురు కుమార్తెలను మంగళవారం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. తీవ్ర పోషకాహారలేమి, ఆకలి కారణంగా చిన్నారులు ముగ్గురూ ఆస్పత్రిలో కన్నుమూశారని పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఆకలి చావుల ఘటనతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఢిల్లీ ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు ఢిల్లీ డెప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చిన్నారులున్న ఇంటిని సోదా చేశారు. నీళ్ల విరేచనాల చికిత్సలోవాడే ఔషధ సీసాలు, మాత్రలు ఇంట్లో దొరికాయి. ఐదు రోజుల క్రితమే చిన్నారుల కుటుంబం ఈ ప్రాంతంలో అద్దెకు దిగిందని స్థానికులు చెప్పారు. చిన్నారుల తండ్రి ఆటో రిక్షా నడిపేవారని, దాన్నిఎవరో దొంగలించడంతో పని కోసం కొద్దిరోజులు వేరేచోటుకు వెళ్లాడని స్థానికులు చెప్పారు. -
ఇంగ్లీష్ చదవలేకపోయిన టీచర్..
ప్రభుత్వ పాఠశాలలో అకస్మిక తనిఖీ నిర్వహించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఓ ఇంగ్లీష్ టీచర్ షాకిచ్చాడు. అనంత పురం జిల్లా తాడి మర్రి మండలం ఏకపాదం పల్లిలోని ప్రాధమికోన్నత పాఠశాలలో బుధవారం ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిశోడియా అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ లోని ఇంగ్లీష్ టీచర్ ను పాఠం చదవమని ఆయన కోరారు. అయితే.. సదరు ఇంగ్లీష్ టీచర్ పాఠం చదవలేక పోవడంతో.. ప్రిన్సిపల్ సెక్రటరీ షాక్ తిన్నారు. వెంటనే ఇంగ్లీష్ టీచర్ సర్దార్ బాబును సస్పెండ్ చేశారు.