రస్ అల్ ఖైమాలో ఉగాది వేడుకలు
రస్ అల్ ఖైమా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రస్ అల్ ఖైమాలో తెలుగు కమ్యూనిటీ.. 'సితార వసుదైక కుటుంబం' ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. రాక్ సిరామిక్స్‌లో పనిచేస్తున్న 1100 మంది తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాక్ సిరామిక్స్ చైర్మన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాలు యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హాల్లో జరిగాయి.
వేడుకల్లో భాగంగా ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి దుర్ముఖీ నామ సంవత్సర పంచాంగం చదివి వినిపించారు. ఉదయం 'మా తెలుగు తల్లి' గీతంతో ప్రారంభమైన వేడుకలు భరతనాట్యం, భక్తిగీతాలు, మిమిక్రీ కార్యక్రమాలతో సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగాయి. చివరగా వేడుకలకు హాజరైన పెద్దలను 'సితార వసుదైక కుటుంబం' ఘనంగా సన్మానించింది.