జస్టిస్ మంజునాథ్‌కు సిట్టింగ్ జడ్జి హోదా తగదు
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎల్.మంజునాథ్‌కు హైకోర్టు సిట్టింగ్ జడ్జి హోదా ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
జస్టిస్ మంజునాథ్‌కు సిట్టింగ్ జడ్జి హోదానిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో 5ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రాజమండ్రికి చెందిన పి.వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ ఆచార్యులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.