బాబు వచ్చాడు.. జాబు పోయింది...!
- గత ఏడాదిలో రెండు నెలల జీతాల్లేవు
- సీఆర్టీల ఆందోళన
పార్వతీపురం టౌన్: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు... తమ జాబు పోరుుందని..’పార్వతీపురం ఐటీడీఏ సబ్ ప్లాన్ పరిధిలో పని చేస్తున్న సీఆర్టీలు వాపోయూరు. ఇక్కడి సీఐటీయూ కార్యాలయం ఓయూటీఎఫ్ నాయకుడు మురళీమోహనరావు ఆధ్వర్యంలో శుక్రవారం వారం తా సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఎన్నికల ముందు ‘బాబు రావాలి.. జాబు రావాలి’ అనే నినాదంతో ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టారని వాపోయూరు. కొన్నేళ్లుగా ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో 167మంది సీఆర్టీలు పని చేసేవారమ ని, నెలకు 4,500 నుంచి 5,500 రూపాయలు జీతం చెల్లించే వారని తెలిపారు.
ఈ క్రమంలో ఈ ఏడాది 89 మం దినే కొనసాగిస్తామని చెప్పడంతో వీరు రెండు రోజుల కిందట ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన అధికారు లు ఉన్నతాధికారులకు తెలి యజేసి తగుచర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. దీంతో ఆర్డర్స్ కోసం శుక్రవారం సీఆర్టీలు ఐటీడీఏ కార్యాల యూనికి వచ్చారు. ఐటీడీఏ పీ ఓ,డీడీ లేకపోవడంతో వారం తా సమావేశమయ్యూరు. భవి ష్యత్ కార్యాచరణపై చర్చించారు. తమకు న్యాయం చే యకుంటే ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు.