situation Critical
-
‘ఇండియాలో పరిస్థితులు బాగాలేవు’.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) సీనియర్ నాయకుడు, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, విదేశాల్లోనే స్థిరపడాలని తన పిల్లలకు చెప్పానంటూ వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవాలని, సాధ్యమైతే అక్కడే స్థిరపడి, పౌరసత్వం కూడా సంపాదించుకోవాలని చెప్పాను. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు బాగాలేవు. వారు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటారో లేదో తెలియదు. ఒక తండ్రి తన పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి’’ అని సిద్దిఖీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ బిహార్ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఖండించారు. సిద్దిఖీ లాంటి వ్యక్తులు జాతి వ్యతిరేక అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని సిద్దిఖీ కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలన్నారు. ఈ దేశం ఎవరి జాగీరూ కాదంటూ దీనిపై సిద్దిఖీ ఆగ్రహం వెలిబుచ్చారు. -
మద్యం మత్తులో యువకుడిపై హత్యాయత్నం
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు పరారీలో నిందితుడు పరకాల : మద్యం తాగే సమయంలో చెలరేగిన గొడవలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలో జరి గింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాజిపేటకు చెందిన ఏకు నాగరాజు(30), అదే ప్రాంతానికి చెందిన గోవింద రాజ్‌కుమార్ బుధవారం రాత్రి మద్యం తాగుతున్నారు. మద్యం తాగే సమయంలో నాకంటే నాకు అని గుంజుకున్నారు. రాజ్‌కుమార్ దగ్గర ఉన్న మద్యాన్ని నాగరాజు బలవంతంగా గుంజుకొని తాగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లకుండ అంబేద్కర్ సెంటర్లో ఉన్న టైర్ల కొట్టు వద్ద పడుకున్నాడు. ఇది గమనించిన రాజ్‌కుమార్ కత్తి పట్టుకొచ్చి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. నాగరాజు తలపై ఐదు చోట్ల, కుడిచేతి భుజంపై కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చి పరారయ్యాడు. రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాగరాజును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నాగరాజును 108లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎం జీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగరాజు పరిస్థితి విషమంగానే ఉంది. నింది తుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది.