సుప్రీం స్టే పై స్పందించిన శివశంకరన్
న్యూఢిల్లీ:ఎయిర్సెల్-మాక్సిస్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్నిఎయిర్సెల్ అసలు ప్రమోటర్ సి శివశంకర్ స్వాగతించారు. న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందనీ, సుప్రీం పరిశీలనను గౌరవిస్తామంటూ సంతోషం వ్యక్తంచేశారు. మలేషియా మాక్సిస్ గ్రూప్ మాక్సిస్ నుంచి ఎయిర్ సెల్ 2 జి లైసెన్సుల బదిలీ ఒప్పందంపై తాత్కాలిక స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మర్చంట్ బ్యాంకర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (ఎస్సీబీ)భారతీయ బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్ సెల్స్ యూజర్స్ ను టేక్ ఓవర్ చేసే కొనుగోలుదారుని చూడలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ను శివశంకర్ కోరారు. తద్వారా ఎయిర్ సెల్, శివ గ్రూపు బాకీల చెల్లింపునకు తోడ్పడాలని కోరారు.
కాగా కావాలనే తన 2జి స్పెక్ట్రం లైసెన్సు తిరస్కరించారని చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ అప్పట్లో ఆరోపించారు. అలాగే ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే14 రకాల లైసెన్సులకోసం దరఖాస్తు చేసుకోగా వేటినీ పట్టించుకోలేదు. విసిగి పోయిన శివశంకరన్ డిసెంబరు 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్ కి 14 లైసెన్సులూ వచ్చేశాయి. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి సోదరుని కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రు.599.01 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే.