siva swamy
-
ఏలూరు జిల్లా: శివస్వామికి కారంతో అభిషేకం
-
వీలునామాలకు ఆస్కారంలేదు
బ్రహ్మంగారి మఠం: బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతిగా శివైక్యం చెందిన మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామిని ధర్మపరిరక్షణ సమితి నిర్ణయించిందని గుంటూరు జిల్లా శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో సమితి సభ్యులు, వివిధ మఠాలకు చెందిన 20 మంది పీఠాధిపతులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మఠాధిపతి ఎంపికలో వారసత్వానికే హిందూ మతం ప్రాధాన్యతనిస్తుందని.. వీలునామాలకు ఆస్కారంలేదని ఆయన తేల్చిచెప్పారు. ధర్మపరిరక్షణ సమితి సభ్యులమైన తాము ఏ మఠంలో సమస్యలున్నా వాటిని పరిష్కరించడమే తమ బాధ్యత అన్నారు. ఇందులో భాగంగా ధర్మపరిరక్షణ సమితి భక్తులు, కందిమల్లాయ్యపల్లె గ్రామస్తులు, ఉప పీఠాలు, వివిధ మఠాధిపతులతో సంప్రదింపులు జరపగా అధిక శాతం వారసత్వానికే ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వారి సలహాలు, సూచనలు ఇచ్చారని శివస్వామి చెప్పారు. ధర్మపరిరక్షణ సమితి కూడా వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించాలని భావిస్తోందని.. ఇదే విషయంపై దేవదాయశాఖ పరిధిలో ఉన్న ధార్మిక పరిషత్‌కు నివేదిక ఇస్తామన్నారు. మఠాధిపతి మృతిపై అనుమానాలు ఇదిలా ఉంటే.. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని శివస్వామి తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనపై ఒత్తిడి రావడంతోనే మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారని వివరించారు. అలాగే, మఠాధిపతి నివాసంలో పనిచేస్తున్న చంద్రావతమ్మ అనే మహిళ ఇంతవరకు కనిపించకపోవడంపై శివస్వామి అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాక.. మఠంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయని.. వీటన్నింటిపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం మఠాధిపతి నియామకాన్ని పూర్తిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
‘నిర్భందించినా పాదయాత్ర చేస్తా’..
సాక్షి, విజయవాడ : హిందుధర్మ పరిరక్షణ కోసం, తిరుమల పవిత్రను కాపాడాలని కోరుతూ.. హిందూ ఆలయాల్లో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ శివస్వామి మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆదివారం విజయవాడ దుర్గగుడి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. 30మంది స్వామీజీలతో ఆయన ఈ మహా పాదయాత్ర చేయనున్నారు. అయితే శివస్వామి పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు నగర పోలీసులు. పాదయాత్ర చేపడితే అరెస్ట్ చేస్తామంటున్నారు. కాగా శివస్వామిపై ఇదివరకే ఎస్సీ, ఎస్టీ కేసులతో సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. తనను పోలీసులు నిర్భందించినా శివస్వామి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఈ పాదయాత్రకు విశ్వధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు భారీగా తరలివస్తున్నారు. శివస్వామి పాదయాత్ర దృష్టా్య స్వామీజీలు వస్తున్నారనే సమాచారంతో ప్రకాశం బ్యారేజీపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. -
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి : శివస్వామి
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ శైవక్షేత్రంపై దాడులు చేస్తున్నారు శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ : ప్రభుత్వం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. దేవాలయాల కూల్చివేతను నిరసిస్తూ ధర్మపరిరక్షణ సమితి ఆధ్వర్యాన విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పది రోజులుగా శైవక్షేత్రంపై దాడులుచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తాను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటూ శైవక్షేత్రానికి రూ.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని చెప్పారు. అధికారం ఉందికదా అని ఏం చేసినా ఫర్వాలేదని ఎమ్మెల్యే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన హిందూ ధర్మపరిరక్షణకు వెనుకడుగు వేసిది లేదని తేల్చిచెప్పారు. నెలరోజులు గడిచినా దేవాలయాల కూల్చివేతపై మఠాధిపతులు, పీఠాధిపతులకు మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వానికి మరో రెండు రోజులు గడువిస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శివస్వామి స్పష్టంచేశారు. శనివారం నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పుష్కరాలకు ఆధ్యాత్మిక సేవల సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. రిలేనిరాహారదీక్షలో ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు పి.వి.స్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.