
శివస్వామి (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : హిందుధర్మ పరిరక్షణ కోసం, తిరుమల పవిత్రను కాపాడాలని కోరుతూ.. హిందూ ఆలయాల్లో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ శివస్వామి మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆదివారం విజయవాడ దుర్గగుడి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. 30మంది స్వామీజీలతో ఆయన ఈ మహా పాదయాత్ర చేయనున్నారు. అయితే శివస్వామి పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు నగర పోలీసులు. పాదయాత్ర చేపడితే అరెస్ట్ చేస్తామంటున్నారు.
కాగా శివస్వామిపై ఇదివరకే ఎస్సీ, ఎస్టీ కేసులతో సహా పలు ఇతర కేసులు నమోదయ్యాయి. తనను పోలీసులు నిర్భందించినా శివస్వామి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఈ పాదయాత్రకు విశ్వధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు భారీగా తరలివస్తున్నారు. శివస్వామి పాదయాత్ర దృష్టా‍్య స్వామీజీలు వస్తున్నారనే సమాచారంతో ప్రకాశం బ్యారేజీపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment