బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పాండో రిజర్వాయర్లో మృతదేహన్ని ఎన్డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అయితే లభ్యమైన మృతదేహం శివప్రసాద్ వర్మ మృతదేహంగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహన్ని హైదరాబాద్కు తరలించనున్నట్టు సమాచారం.