sixteen Years
-
పదహారేళ్ల తర్వాత...
పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. -
లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి
చంద్రగిరి: ద్విచక్ర వాహనంలో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇద్దరు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. 16 ఏళ్ల బాలిక నవంబర్ 24న ఇంట్లో గొడవతో అలిగి తిరుపతికి చేరుకుంది. అదేరోజు అర్ధరాత్రి తిరుపతి పద్మావతీపురం నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళుతోంది. ఈ క్రమంలో చిత్తూరుకు చెందిన వెంకటేష్ (31) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బాలిక తిరుచానూరు వరకు లిఫ్ట్ కోరింది. ఆమెను తన వాహనంపై ఎక్కించుకున్నాడు. తిరుచానూరులో ఆమెను వదిలిపెట్టకుండా ముళ్లపూడి వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని ఆపి, పెట్రోల్ అయిపోయిందని ఆమెను నమ్మించాడు. స్నేహితుడు బుక్కే రాజమోహన్నాయక్ (28)ను పెట్రోల్ తీసుకురమ్మని చెప్పినట్లు పేర్కొన్నాడు. రాజమోహన్నాయక్ రాగానే ఇద్దరూ రోడ్డుపై నుంచి ఆమెను బలవంతంగా ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి, లైంగికదాడి చేశారు. ఆమె అరుపులతో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో పారిపోయారు. ఘటనను బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు వివరించింది. వారు తిరుచానూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను తిరుచానూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజమోహన్నాయక్పై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. -
అమ్మ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా..
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ, హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆమె తల్లి సఖి కలవడానికి రావడమే ఇందుకు కారణం. అమ్మ తనను కలడానికి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యానని షర్మిల అన్నారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె పదహారేళ్లుగా నిరశన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తల్లి తనను కలవడానికి వస్తే మనసు మార్చుకొని దీక్షను విరమించాల్సి వస్తుందని ఆమె ఇన్నాళ్లూ తల్లికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దీక్షను విరమించడంతో కుమార్తెను తల్లి కలిశారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 2000 సంవత్సరం నుంచి నిరశన దీక్షను కొనసాగించారు. ఇటీవలే ఆగస్టు 9 న తన దీక్షను విరమించారు. తాను వివాహం చేసుకుంటానని త్వరలోనే రాజకీయాలలో చేరుతానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.