skidded
-
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డ జవాన్..
న్యూఢిల్లీ : ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో ఓ జవాన్ జారిపడ్డాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ దగ్గర పెట్రోలింగ్ పార్టీ ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అతని కోసం ఆర్మీ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన జవాన్ ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్లగా గుర్తించారు. జవాను జారిపడిన విషయం తెలిసిన వెంటనే సైనికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తొలుత పెట్రోలింగ్ పార్టీ ఆపరేషన్ ప్రారంభించగా.. అనంతరం మరో 200 మంది గాలింపు చర్యల్లో దిగారు. నీటిమట్టం ఎక్కువగా ఉండడంతోపాటు ప్రవాహ ఉధృతి కూడా అధికంగా ఉన్నప్పటికీ ప్రకాశ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్లు, నిఘా హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక బలగాలు, ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఈతగాళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. -
స్వల్ప ప్రమాదానికి గురైన రాష్ట్రపతి కాన్వాయ్..
డార్జలింగ్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం ఎదురైంది. ఉదయం బగ్దోగ్రా నుంచి ఢిల్లీ విమానం ఎక్కేందుకు బయల్దేరిన రాషప్ట్రపతి కాన్వాయ్ 30 కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదానికి గురైంది. సొనాడా ప్రాంతానికి చేరగానే కాన్వాయ్ లోని మూడో వాహనం రోడ్డునుంచి జారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానం ఎక్కేందుకు బగ్దోగ్ రానుంచి బయల్దేరిన రాష్ట్రపతి కాన్వాయ్ కి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం ఎక్కేందుకు రాష్ట్రపతి బయల్దేరిన కొద్ది సేపటికి సొనాడో ప్రాంతానికి రాగానే అక్కడ కొండ చెరియలు విరిగి పడటంతో కాన్వాయ్ లోని మూడో వాహనం జారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, రాష్ట్రపతితోపాటు మిగిలిన సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం.. ఢిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాష్ట్రపతితోపాటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి ఏపీ సింగ్ ఉన్నారు. భారీ వర్షాలు, మంచు కారణంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు రాష్ట్రపతి ప్రయాణానికి హాజరు కాలేకపోవడంతో ఆయన రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన సైనిక సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సురక్షిత ప్రాంతానికి తరలించడంతోపాటు, అక్కడి ఆపరేషన్ ను మమతా బెనర్జీ దగ్గరుండి పర్యవేక్షించినట్లు ఆమె ప్రెస్ సెక్రెటరీ వేణు రాజమణి తెలిపారు. సహాయక చర్యల్లో పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా సహాయపడ్డారు.