Skin problem
-
స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. కొత్తగా ఫోటో షూట్స్ కానీ, యాడ్ షూట్స్‌లో కానీ కనిపించడంలేదు. సినిమా ఫంక్షన్స్‌కి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె అనారోగ్యానికి గురైయ్యారని ఆ మధ్య సోషల్ మీడియా కోడై కూసింది. దీనిపై ఆమె మేనేజర్ స్పందిస్తూ సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేయడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. తాజాగా మరోసారి సామ్ హెల్త్‌పై అలాంటి వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సమంత ‘పాలీమర్ ఫోర్స్ లైట్ ఎరప్షన్’ అనే స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుందని ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. (చదవండి: కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ..వీడియో వైరల్) తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ స్పందించాడు. సమంత అరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పాడు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. అయితే, సమంత అమెరికాకు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక సమంత సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన యశోద, శాకుంతలంల చిత్రాలు రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ నెక్ట్స్ షెడ్యూల్డ్ స్టార్ట్ కావాల్సి ఉంది. -
సమంత ఆరోగ్యంపై వదంతులు..
సెలబ్రెటీల విషయంలో చీమకుట్టినా వార్త అయిపోతుంది. అలాంటి వారిపై గాలివార్తలు కూడా వైరల్ అవుతుంటాయి. అలా వదంతులను ఎదుర్కొంటున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె షూటింగ్లో పాల్గొన్నా లేకపోయినా వార్తే. మనస్పర్థల కారణంగా టాలీవుడ్ నటుడు నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత గురించి రకరకాల ప్రచారం ట్రోలింగ్ అవుతుందనే చెప్పాలి. ఆమె అందాలారబోత దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో తరచూ విడుదల చేయడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఆ మధ్య కాస్త విరామం తీసుకున్న సమంత తన స్నేహితురాలితో కలిసి విదేశాలు చుట్టి వచ్చింది. ఆ సమయంలో ఆమె స్కిన్ సమస్యతో బాధపడుతోందనే ప్రచారం హోరెత్తింది. దీంతో ఆమె మేనేజర్ స్పందిస్తూ సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. అలాంటిది ఈ బ్యూటీ గురించి ఇప్పుడు మరోసారి అలాంటి వార్త నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. పాలీమర్ ఫోర్స్ లైట్ ఎరప్షన్ అనే స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆమె విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి చిత్ర షూటింగ్లో బాధింపునకు గురైందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతల చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అదేవిధంగా యశోద చిత్రం కూడా నిర్మాణాంత కార్యక్రమాల దశలో ఉంది. సమంత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఖుషి చిత్రంలో పాల్గొంటుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. -
సేంద్రియ బ్యూటీ
తీవ్రమైన చర్మ సంబంధ సమస్యలతో తల్లి చనిపోయింది. తల్లికి అన్నీ తానై సేవలందించిన కృతికకు తల్లి చనిపోయాక ఏం చేయాలో తోచలేదు. దీంతో తన తల్లిపడిన కష్టం మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో చర్మానికి హానికరం కానీ కూరగాయలు, మేకపాలతో సబ్బులు, బ్యూటీ ఉత్పత్తులను తయారు చేసింది. వాటిని విల్వా పేరుతో విక్రయిస్తోంది తమిళనాడుకు చెందిన కృతిక. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో కృతిక కుమరన్ పచ్చని పంటపొలాల మధ్య పెరిగింది. 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. దీంతో ఎçప్పుడూ రాష్ట్రం దాటి బయటకు వెళ్లింది లేదు. చిన్నప్పటినుంచి అమ్మ మంజులాదేవితో అనుబంధం ఎక్కువ. మంజులా దేవికి చర్మ సంబంధ సమస్య వచ్చింది. అది తగ్గడానికి వివిధ రకాల స్టెరాయిడ్స్ వాడడంతో అవి చర్మసమస్యను తగ్గించకపోగా కిడ్నీలు పాడయేలా చేశాయి. దీంతో మంజులాదేవి 2016లో మరణించారు. ఎప్పుడూ తనతో ఉండే అమ్మ దూరం కావడాన్ని కృతిక తట్టుకోలేకపోయింది. నిరాశానిస్పృహలకు గురవుతుండేది. ఎలాగైనా వీటి నుంచి బయటపడాలనుకుంది. ఈ క్రమంలోనే... వివిధరకాల సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల వల్ల చర్మసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో అమ్మను దగ్గరనుంచి చూసిన కృతికకు మార్కెట్లో దొరికే వాటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో వాటిని తయారు చేయాలనుకుంది. కానీ వాటిని ఎలా రూపొందించాలో తెలిసేది కాదు. మేకపాలతో సబ్బు.. వివిధ రకాల పదార్థాలతో సహజసిద్ధంగా సబ్బులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే.. నేచురల్ కాస్మటాలజీ కోర్సు చేసింది. మేకపాలకు కొన్ని ఇతర రకాల పదార్థాలు కలిపి సబ్బులు తయారు చేసి తెలిసిన వారికి, స్నేహితులకు ఇచ్చేది. ఆ సబ్బులు తామరవ్యాధితో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతున్నట్లు చెప్పడంతో కృతికకు మంచి ప్రోత్సాహంగా అనిపించింది. ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసేది. విల్వా.. అమ్మ చనిపోయిన ఏడాది తరువాత 2017లో ‘విల్వా’ పేరుతో స్టోర్‌ను ప్రారంభించింది. బిల్వపత్రం పేరుమీదగా ఈ పేరుపెట్టింది. ప్రారంభంలో కృతిక తయారు చేసే ఉత్పత్తులను ఫేస్బుక్ పేజిలో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేసింది. సబ్బులతోపాటు, స్కిన్‌కేర్, బ్యూటీ ఉత్పత్తులను సహజసిద్ధ పదార్థాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, వెన్నను ఉపయోగించి తయారు చేసేది. క్లెన్సర్స్, టోనర్స్, ఫేస్‌మాస్క్‌లు, సీరమ్స్, కండీషనర్లు, మాయిశ్చరైజర్, జెల్, పెదవులు, కళ్లకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, షాంపులు, హెయిర్ ఆయిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. మహిళలకేగాక, పురుషులకు సైతం బ్యూటీ ఉత్పత్తులను అందించడం విశేషం. ఇండియాలోనేగాక, యూకే, యూఎస్, మలేసియా, సింగపూర్, గల్ఫ్‌దేశాలకు సైతం కృతిక తన విల్వా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. వివిధ ఆన్లైన్ వేదికలపై విల్వా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. -
తల్లి వైద్యం
‘నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అంటారు. రూపమ్ విషయంలో మాత్రం ‘చైల్డ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అనుకోవాలి. కూతురు కలిగించిన అవసరం కారణంగా ఆ తల్లి ఓ దివ్యౌషధాన్ని కనిపెట్టారు మరి! తెలంగాణలో ఉంటున్న రూపమ్ సింగ్ ఓ రెండేళ్ల నుంచి ఎగ్జిబిషన్లలో ఒక టేబుల్ వేసుకుని ఒక స్టాల్ పెడుతోంది. ఆమె ఒక చిన్న కుటీర పరిశ్రమ నిర్వాహకురాలిగా ప్రపంచానికి పరిచయమై నిండా ఐదేళ్లు కూడా కాలేదు. ‘‘గృహిణిగా ఉన్న మీరు పరిశ్రమ ఎప్పుడు స్థాపించారు. చిన్న పాపాయిని చూసుకుంటూ, పరిశ్రమను నడిపించడం ఇబ్బందిగా అనిపించడం లేదా’’ అని తెలిసినవారెవరైనా అడిగితే ఆమె చెప్పే సమాధానం ఒక్కటే.. నా పరిశ్రమ వయసు... పాపాయి వయసుకు ఒక ఏడాది తక్కువ. నన్ను పారిశ్రామిక వేత్తను చేసింది నా పాపాయే’’ అని నవ్వుతుంది. మరో క్షణంలో పాపాయికి ఎదురైన చర్మ సమస్య గుర్తుకు వచ్చి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. గాలి కూడా పడేది కాదు! ‘‘మా పాపకు పుట్టినప్పటి నుంచి చర్మ సమస్య ఉంది. ఎన్ని క్రీములు రాసినా తగ్గేది కాదు. ఎంతమంది డెర్మటాలజిస్టులను కలిశానో లెక్కే లేదు. మార్కెట్లో ఉన్న రకరకాల లోషన్లు రాశాను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే... పాపాయి పాకుతూ కార్పెట్ మీదకు వెళ్లిందంటే ఆ వెంటనే ఒళ్లంతా ఎర్రగా దద్దుర్లు వచ్చేవి. కార్పెట్‌లో దాగిన దుమ్ము కణాల వల్ల అలా అవుతుందని కార్పెట్ తీసేశాను. పాపాయి తిరిగే నేలను తళతళ మెరిసేలా తుడిచేదాన్ని. అయినా ర్యాష్ వస్తూనే ఉండేది. ఆఖరుకు నేను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా ... వెంటనే బుగ్గంతా గరుకు తేలి ఎర్రగా అయ్యేది. చివరకు ఇంటి నాలుగ్గోడలు దాటలేని పరిస్థితి వచ్చింది. చెట్ల గాలి కోసం పాపాయిని బయటకు తీసుకెళ్లినప్పుడు.. ఒంటికి ఏమీ తగలకుండా చూసుకున్నా కూడా గాల్లోని ఇన్ఫెక్షన్ ఒంటిని ఎర్రబార్చేది. డాక్టర్లు ఎగ్జిమా అని రకరకాల మందులిచ్చేవారు. అవి రాస్తే మరింత మంటగా అనిపించేదో ఏమో... పాపాయి ఇంకా ఎక్కువగా ఏడ్చేది. అలా తొమ్మిది నెలల వరకు బాధపడింది. నా అదృష్టమో, పాపాయి అదృష్టమో కానీ అప్పుడు ఒక డాక్టర్ ఇచ్చిన సలహా మా జీవితాలను మార్చేసింది. ఇల్లే ఔషధాలయం మా అమ్మమ్మ, నానమ్మలు మాకోసం చిన్నప్పుడు వాడిన దినుసుల జాబితా రాసుకుని వాటి కోసం మార్కెట్లో ప్రయత్నించాను. కొన్ని దొరకలేదు. దాంతో వాటిని ఇంట్లోనే తయారు చేయడానికి సిద్ధమయ్యాను. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆ నూనెలో మరికొన్ని దినుసులు కలిపి తైలం తయారు చేసుకుని పాపాయి ఒంటికి రాశాను. సింథటిక్ వస్త్రాలను మానేసి మెత్తటి కాటన్ దుస్తులు మాత్రమే వేశాను. ఇలా నాలుగు వారాల్లోనే చర్మంలో మార్పు కనిపించింది. రెండు నెలలకంతా పాపాయి చర్మం లేత తమలపాకులాగా మారిపోయింది. పాపాయిని చూసిన బంధువులు, పక్కిళ్ల వాళ్లు ‘‘ఏం మందులు వాడారు? ఎలా తగ్గింది?’’ అని ప్రశ్నలు. నేను చేసింది చెప్పిన తర్వాత చాలా మంది రొటీన్ స్కిన్ కేర్ కోసం క్రీమ్‌లు, తైలాలు అడిగి చేయించుకునే వారు. మొదట్లో ఫ్రీగా చేసిచ్చాను. ఇలా ఉచితంగా ఇస్తుంటే– తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, డబ్బులు తీసుకోమనేవాళ్లు. దినుసులకు అయిన ఖర్చు మాత్రం తీసుకుని చేసిచ్చాను. దీనినే ఒక బ్రాండ్‌నేమ్‌తో చేయమని మా చెల్లెలు అనుపమ్ సలహా ఇవ్వడంతో 2014లో ‘ప్రకృత’ అనే పేరుతో రిజిస్టర్ చేశాను. ప్రకృతి ఇచ్చిన సహజసిద్ధమైన వస్తువులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా తైలాలు, లేపనాలు చేస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే మా పాపాయి కోసం ఎలా చేశానో, మార్కెట్ కోసం కూడా అలానే చేస్తున్నాను. ఇప్పుడు నాకిది ఒక వ్యాపకంగా మారిపోయింది’’ అని చెప్తుంది రూపమ్. ఇన్ని విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తారామె, ఆఖరుకు తన క్రీమ్‌ల ఫార్ములాలను కూడా. తన పాపాయి పేరు తప్ప! – మంజీర -
ఆ మేని మచ్చలకు కారణం.. మెలాస్మా!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 31 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాలలో గోధుమరంగు మచ్చలు ఏర్పడ్డాయి. డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాను. ఉపశమనం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? సలహా ఇవ్వండి. – సుచరిత, గుంటూరు మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు మెలాస్మా అనే చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చర్మంపై గోధుమ/బూడిద రంగులో మచ్చలు రావడాన్ని మెలాస్మా అంటారు. ఇది ఒక సాధారణ చర్మ సమస్య. సాధారణంగా ఇది బుగ్గలపై, ముక్కుకు ఇరువైపులా, నుదురు, గడ్డం (చిన్)తో పాటు పై పెదవి భాగాల్లో కనిపిస్తుంది. కొందరిలో సూర్యకాంతి పడే చర్మ భాగాలపైనా, మరికొందరిలో చేతులు, మల భాగాలపై కూడా ఈ మచ్చలు రావచ్చు. 10 శాతం మంది పురుషుల్లో, 90 శాతం మంది మహిళల్లో వచ్చే ఈ సమస్య గర్భిణుల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల మనిషికి ఆరోగ్యపరంగా ఎలాంటి హానీ కలగదు. అయితే ముఖంపై మచ్చలు ఉన్న ఫీలింగ్‌తో కొందరు ఆత్మన్యూనత భావాన్ని పెంపొందించుకుంటారు. హోమియో వైద్య విధానం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కారణాలు: ఈ చర్మ సమస్యకు అసలు కారణాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని అంశాలు మన శరీరంలోని రంగును ఉత్పత్తి చేసే కణాలను (మెలనోసైట్స్) ఎక్కువగా వృద్ధి చెందేలా ప్రేరేపిస్తాయి. దాంతో ఈ సమస్య ఏర్పడుతుంది. సమస్యను ప్రేరేపించే అంశాలు ⇒సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు మెలనోసైట్స్‌ను ఉత్తేజపరచడం వల్ల ఈ మచ్చలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఎండలో తిరిగితే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. హార్మోన్లలో మార్పుల వల్ల: గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు సంభవించడం వల్ల ఈ మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే గర్భిణుల్లో ఇవి ఏర్పడే అవకాశం ఎక్కువ. గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో ఉపయోగించే మందుల వల్ల ఈ మచ్చలు రావచ్చు. ⇒ కొన్ని సౌందర్య సాధనాల్లోని ఉపయోగించే పదార్థాలు కూడా ఈ సమస్యను ప్రేరేపించే అవకాశం ఉంది. చికిత్స: హోమియో విధానంలో అందించే కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడి, ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా శరీరం ఎదుర్కొంటుంది. దాంతో మెలాస్మా వ్యాధి కూడా ప్రేరేపితం కాని విధంగా దేహం బలపడుతుంది. అలా హోమియో ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాకుండా శరీరంలోని హార్మోన్ల అసమతౌల్యతలను సరిదిద్దడం వల్ల ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా నయం చేసే అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వయసు పెరుగుతున్నా ఫిట్నెస్ ఎలా? లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అయితే ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో, బైక్ వరకు వెళ్లే టైమ్‌లో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను ఇదివరకులా ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. – సుబ్బారాయుడు, విజయవాడ ఇది మీ వయసు వారంతా ఆలోచించాల్సిన విషయం. వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ప్రతి వందలో 30 మందికి చర్మ సమస్య
ముగిసిన పీడియాట్రిక్ డెర్మటాలజీ-2016 సదస్సు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి వంద మందిలో 30 మంది చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. జన్యుపరమైన లోపంతో పాటు గర్భస్థ సమయంలో తల్లి మోతాదుకు మించి మందులు వాడటం వల్ల పుట్టిన పిల్లల్లో చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ ట్విన్ సిటీస్ బ్రాంచ్(ఐపీఏ టీసీబీ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన నాలుగో పీడియాట్రిక్ డెర్మటాలజీ సదస్సు-2016 ఆదివారం ముగిసింది. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సురేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 390 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. పిల్లల్లో వస్తున్న చర్మ సంబంధ వ్యాధులు, పీడియాట్రిక్ సర్జరీలపై చర్చించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఐపీఏ టీసీబీ అధ్యక్షుడు డాక్టర్ రంగయ్య, కోశాధికారి డాక్టర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన గాంధీ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థి శ్రీనాథ్‌కు చంద్రశేఖర్ చౌదరి బంగారు పతకాన్ని అందజేశారు. ‘చర్మం పొడిబారటం, గోకితే తెల్లని పొడి రావడం లాంటి వ్యాధులపై చాలా మందికి సరైన అవగాహన లేదు. దీంతో వ్యాధి ముదిరి చర్మ కేన్సర్‌కు కారణమవుతోంది. తక్కువ గాఢత ఉన్న సబ్బులకు వాడటం ద్వారా పిల్లలను చర్మ వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు’ అని ప్రొఫెసర్ థామస్ చెప్పారు. -
ఆన్లైన్ వైద్యం!
సాంకేతిక వైద్యం చర్మ సమస్య వేధిస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేటంత వెసులుబాటు లేనంత పని ఒత్తిడిలో ఉన్నారా? అయితే చేతిలో సెల్‌ఫోన్‌కి పని చెప్పడమే. ర్యాష్, ఎగ్జిమా వంటి ఏ రకమైన చర్య సమస్య అయినా సరే ఫొటో తీసి ఆ ఫొటోని చర్మవ్యాధి నిపుణులకు పంపించాలి. డెర్మటాలజిస్టు (చర్మవ్యాధి నిపుణులు) ఆ ఫొటో ఆధారంగా వ్యాధిని నిర్ధారించి చికిత్సను సూచిస్తారు. మొబైల్ ఫోన్లో చిన్న మెసేజ్ ద్వారా ప్రిస్కిప్షన్ పంపిస్తారు. ఆ మెసేజ్‌ని మందుల దుకాణంలో చూపించి కొనుక్కుని వాడడమే. తప్పని సరిగా స్వయంగా చూసి కానీ నిర్ధారించలేని రుగ్మత అయితే వైద్యులు అదే విషయాన్ని తెలియచేసి సంప్రదించాల్సిన సమయాన్ని(అపాయింట్మెంట్) తెలియచేస్తారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా వైద్యం చేస్తూ పోతే డాక్టర్‌కు ఫీజు అందేది ఎలాగంటారా? ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడమే. అమెరికాలో ఈ విధానంలో వైద్యం అందుబాటులోకి వచ్చేసింది. అమెరికా నుంచి దత్తత చేసుకునే అన్ని అంశాల్లాగానే దీనిని కూడా మనదేశంలో త్వరగానే స్వీకరించవచ్చు. ఇంతకీ ఇటీవల ఒక అధ్యయనంలో ఓ కొత్త విషయం తెలిసింది. ఎటోపిక్ డెర్మటైటిస్ (ఎగ్జిమా) వ్యాధి ఎక్కువ కావడానికి కారణం గంటల కొద్దీ కంప్యూటర్ ముందు, డిజిటల్ కెమెరాల ముందు గడపడమేనట.