ఆధ్యాత్మికం..ఆరోగ్యం.. కార్తీకం
చలికాలంలో మనిషిలో బద్దకం పెరుగుతుంది. ఉష్ణోగ్రత తక్కువస్థాయికి పడిపోతుంది. వీటిని తట్టుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుని రోజంతా సమర్థంగా పనిచేసేందుకు కార్తీకమాసం ఆచారాలు దోహదపడతాయి.
మహిళలు తెల్లవారుజామునే నిద్రలేవడం, పసుపురాసుకోవడం, చన్నీటితో స్నానం చేయడం, ఆల యానికి వెళ్లి తులసిమొక్కకు నీళ్లుపోసి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలాం టివి ఇందు కు ఎంతో ఉపయోగపడతాయి. అల్పాహారం, మధ్యాహ్నం మిత భోజనం, రాత్రికి పండ్లు, పాలు వంటివి తీసుకోవడం ఇందులోభాగమే. ఈ నెలలో నిష్టగా నియమాలు పాటిస్తే స త్ఫలితాలను పొందవచ్చని నిపుణులు, పండితులు సూచిస్తున్నా రు.
సూర్యోదయంలోపే స్నానం
తెల్లవారుజామున సూర్యోదయంలోగా స్నానం చేస్తే రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
తీర్థంతో ఆరోగ్యానికి ఎంతో మేలు
ఆలయంలో పచ్చకర్పూరం, పటిక, తులసి, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థం భక్తులకు ఇస్తుంటారు. దీని వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మహిళలు ఉదయాన్నే పసుపు రాసుకోవడం వల్ల చర్మవ్యాధులు దరిచేరవు.
చైతన్యవంతానికి ఉపవాసం
కార్తీకమాసంలో చాలా మంది ఉపవాస దీక్ష చేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయం తగ్గుతుంది. శరీరంలో అన్ని అవయవాలు చైతన్యవంతంగా పనిచేస్తాయి. దీక్ష ఉన్నవారు పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి.