పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాళ్లకల్ వద్ద ఓ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్లీప్ ఫైన్ మాట్రస్ పరుపుల తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.