Sleepwalking
-
స్లీప్ వాకింగ్ అలవాటు.. అర్థరాత్రి లేచి
ముంబై : నిద్రలో నడిచే అలవాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, కలినా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల వజ్రాల కార్మికుడు ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి ఓ పెద్ద బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో పైకి లేచి నిద్రలో నడవటం మొదలుపెట్టాడు. ఇళ్లు మొత్తం అటుఇటు తిరిగాడు. అనంతరం నాలుగవ అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్ కిటికీ తెరిచి కిందపడిపోయాడు. అతడి కేకలు విని నిద్రలేచిన కుటుంబసభ్యులు కిటికీలోంచి బయటకు చూడగా.. నేలపై రక్తపు మడుగులో అతడు కనిపించాడు. (ఇద్దరు పిల్లల తండ్రి.. ప్రియురాలి తల్లితో జంప్! ) వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదం కారణంగా చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నెలకోసారి గానీ, రెండుసార్లు గానీ, అర్థరాత్రి పూట నిద్రలో నడుస్తాడని, ఫ్లాట్‌లో అటు ఇటు తిరుగుతాడని పోలీసుల విచారణలో తెలిసింది. -
11వ అంతస్తు నుంచి కిందపడినా..
-
11వ అంతస్తు నుంచి కిందపడినా..
థాయ్‌లాండ్: కేవలం ఒక్క అంతస్తు పైనుంచి పడి మరణించిన వారిని చూసుంటాం. మరి 11 అంతస్తు నుంచి పడితే... బతికే చాన్సే లేదు. కానీ థాయ్‌లాండ్‌లో ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కిందపడినా కూడా ప్రాణాలతో బయటపడి మృత్యుంజయురాలిగా నిలిచింది. వివరాల్లోకెళ్తే... వ్యక్తిగత పనిపై దీచా సూక్పలం అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణానికి వెళ్లాడు. వీరిద్దరూ అక్కడే ఓ హోటల్లో బస చేశారు. నిద్రలో నడిచే అలవాటున్న దీచా కుమార్తె రాత్రి గది నుంచి బయటకు వచ్చింది. తర్వాత వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ చిన్నారి నేరుగా బాల్కానీ వైపు వెళ్లి గోడపైకి ఎక్కి వేలాడింది. కాసేపు గోడపై వేలాడిన చిన్నారి పట్టు తప్పడంతో 11వ అంతస్తు నుంచి పడిపోయింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదంతా హోటల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చిన్నారి కిందపడిపోతూ గట్టిగా కేకలు పెట్టింది. హోటల్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆ చిన్నారి కింద పడిపోయి స్పృహతప్పింది. వెంటనే ఆమెను బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ప్రాణహాని లేదని.. గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
అప్పుడు దెబ్బతగిలినా నొప్పి ఉండదు!
లండన్: నడిచేటప్పుడు కాలికి చిన్న రాయి తగిలినా భరించలేనంత నొప్పి కలుగుతుంది. అయితే నిద్రలో నడిచేటప్పుడు మాత్రం ఎంత పెద్ద గాయం అయినా, భవనంపై నుంచి పడి కాలు విరిగినా ఏ మాత్రం నొప్పి ఉండదంట!. అయితే తలనొప్పి, పార్శ్వపునొప్పి(ఒకపక్క తలనొప్పి) ప్రమాదం మాత్రం ఎక్కువగా ఉంటుందంట. ఈ మేరకు లండన్‌లో నిద్రలో నడిచే వారిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది తాము నిద్రలో నడిచేటప్పుడు గాయం అయినా నొప్పి తెలియదని చెప్పారు. అయితే మెలుకువ వచ్చినప్పడు మాత్రం ఈ బాధేంటో బాగా తెలుస్తోందంట. ముప్పై ఏళ్ల వయసున్న వారిపై జరిపిన ఈ సర్వేలో 55 మంది పురుషులు, 45 మంది మహిళలు పాల్గొన్నారు. నిద్రలో నడిచిన ప్రతిసారీ తమకు కనీసం ఒక గాయం అయ్యిందని 47 మంది వెల్లడించారు. వీరిలో కేవలం పది మందికి మాత్రమే గాయం అయిన వెంటనే నొప్పి తెలిసిందంట. మిగతా 37 మందికి మాత్రం ఉదయాన్నో లేదా మేల్కొన్న తర్వాత నొప్పి కలిగిందంట. ఉదహారణకు నిద్రలో నడిచే వ్యక్తి మూడో అంతస్తులో ఉంటున్నాడనుకోండి. నిద్రలో నడుస్తూ కిటికిలోంచి కిందకు పడి తీవ్ర గాయాలు అయినా, అప్పుడు నొప్పి తెలియదు. మేల్కొన్న తర్వాత గాయాలు తాలుకూ నొప్పి తెలుస్తుంది. మరో వ్యక్తి తన ఇంటిపై నుంచి పడి కాలు విరిగినా ఉదయం వరకు నిద్రలేవడంట.