Mumbai: Sleepwalking Man In Kalina Plunges 4th Floor To Died - Sakshi
Sakshi News home page

స్లీప్‌ వాకింగ్ అలవాటు‌.. అర్థరాత్రి లేచి

Published Thu, Feb 18 2021 6:52 PM | Last Updated on Thu, Feb 18 2021 10:14 PM

Sleepwalking Man Deceased After Fell From 4th Floor In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : నిద్రలో నడిచే అలవాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, కలినా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల వజ్రాల కార్మికుడు ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి ఓ పెద్ద బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో పైకి లేచి నిద్రలో నడవటం మొదలుపెట్టాడు. ఇళ్లు మొత్తం అటుఇటు తిరిగాడు. అనంతరం నాలుగవ అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్‌ కిటికీ తెరిచి కిందపడిపోయాడు. అతడి కేకలు విని నిద్రలేచిన కుటుంబసభ్యులు కిటికీలోంచి బయటకు చూడగా.. నేలపై రక్తపు మడుగులో అతడు కనిపించాడు. (ఇద్దరు పిల్లల తండ్రి.. ప్రియురాలి తల్లితో జంప్‌! )

వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయినట్లు తెలిపారు.  ప్రమాదం కారణంగా చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నెలకోసారి గానీ, రెండుసార్లు గానీ, అర్థరాత్రి పూట నిద్రలో నడుస్తాడని, ఫ్లాట్‌లో అటు ఇటు తిరుగుతాడని పోలీసుల విచారణలో తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement