Sloth bear
-
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
అంతెత్తు లేచింది.. వెంటపడి తరిమింది..!
న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ అవును! అడవి జంతువులు అడవిలో నివసిస్తాయి. కానీ అడవి పాలన ఏం చెబుతుంది? అక్కడ బలవంతుడిదే మనుగడ. అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ పోరాటంలో దూకుడుగా ఉన్న వ్యక్తిదే పై చేయి అయినట్లు.. ఏ జంతువైతే మరో జంతువును త్వరగా భయపెట్ట గలదో.. దానికి అడవిలో రక్షణ ఉంటుంది.’’ అంటూ రాసుకొచ్చారు. Sloth bear scaring away a Tiger - not quite a rare thing in the forests! Most bears (esp mumma bears) do attempt to scare the predator at the first instance by raising it's forelimbs to make them look large in size. This trick worked out for this bear. Video shared by a senior pic.twitter.com/SIikET7Asm — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 10, 2021 -
బెబ్బులి వర్సెస్ ఎలుగుబంటి.. భీకర ఫైటింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బెబ్బులి పేరు వింటనే వణికిపోతాం. సాధారణంగా పెద్ద పులి సింహానికి మాత్రమే భయపడుతుందని, సరిగ్గా ఎదురు తిరిగితే ఒక్కోసారి దాన్ని కూడా పడగొడుతుందని కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. అయితే, మృగరాజును సైతం హడలెత్తించే పెద్ద పులి కాస్త ఎలుగుబంటితో పోరాడలేక పారిపోయింది. పోరులో ఓడి తోకముడిచి వెనుకడుగు వేసింది. దాంతో రెచ్చిపోయిన ఆ ఎలుగుబంటి కాస్త తరిమితరిమి కొట్టింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్లో చోటు చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.. వాటి మధ్య జరిగిన భీకరపోరును మీరు కూడా ఓసారి చూడండి. -
భీకర ఫైటింగ్..బెబ్బులి వర్సెస్ ఎలుగుబంటి..
-
బావిలో పడి రెండు ఎలుగుబంట్లు మృతి
వీణవంక మండలం శ్రీరాములపేట సమీపంలో అటవీప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంట్లు బావిలో పడి చనిపోయాయి. ఆదివారం రాత్రి బావిలో ఎలుగుబంట్లు పడినట్లు చెబుతున్నారు. సోమవారం ఉదయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంట్లు ఉన్న బావిలోకి నిచ్చెనను దించి వెళ్లిపోయారు. అయితే, బావిలో నీళ్లు ఉండటంతో అవి నిచ్చెన మీదుగా పైకి రాలేకపోయాయి. నీటిలో మునిగి రెండు ఎలుగులు చనిపోగా మరొకటి ప్రాణాపాయ స్థితిలో ఉంది. దీనిని బయటకు లాగిన గ్రామస్తులు వెటరినరీ సిబ్బంది సాయంతో వైద్యం అందిస్తున్నారు.