న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ అవును! అడవి జంతువులు అడవిలో నివసిస్తాయి. కానీ అడవి పాలన ఏం చెబుతుంది? అక్కడ బలవంతుడిదే మనుగడ. అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ పోరాటంలో దూకుడుగా ఉన్న వ్యక్తిదే పై చేయి అయినట్లు.. ఏ జంతువైతే మరో జంతువును త్వరగా భయపెట్ట గలదో.. దానికి అడవిలో రక్షణ ఉంటుంది.’’ అంటూ రాసుకొచ్చారు.
Sloth bear scaring away a Tiger - not quite a rare thing in the forests!
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 10, 2021
Most bears (esp mumma bears) do attempt to scare the predator at the first instance by raising it's forelimbs to make them look large in size. This trick worked out for this bear.
Video shared by a senior pic.twitter.com/SIikET7Asm
Comments
Please login to add a commentAdd a comment