small kid died
-
ప్రియురాలి మోజులో కన్నబిడ్డల్ని 15వ అంతస్తు నుంచి కిందికి తోసిన కసాయి!
Chinese Father Girlfriend Sentenced to Death for killing two toddlers by throwing out of building బీజింగ్: ప్రియురాలి మోజులో కన్న బిడ్డల్నే కడతేడ్చాడా కసాయి తండ్రి. నిర్థాక్షిణ్యంగా 15 వ అంతస్థు నుంచి కిందకి తోసేశాడు. వేరే స్త్రీకి పుట్టిన పిల్లలను పెంచడం ప్రియురాలికి ఇష్టంలేకపోవడమే కారణం. దీంతో కోర్టు సదరు తండ్రికి, అతని ప్రియురాలికి మరణశిక్ష విధించింది. మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని చాంగ్కింగ్ మున్సిపాలిటీకి చెందిన జాంగ్ బో (25)అనే వ్యక్తి మొదటి భార్య అయిన చెన్ మెయిలిన్కు విడాకులిచ్చాడు. తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ యే చెంగ్షెన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐతే మొదటి భార్యకు పుట్టిన ఇద్దరు పిల్లలను పెంచడానికి ఆమె నిరాకరించింది. పిల్లలను వదిలించుకోమని తరచూ పోరుపెట్టేది. అంతేకాకుండా పిల్లలుంటే వివాహం చేసుకోనని షరతు కూడా పెట్టింది. దీంతో ఆ కసాయి తండ్రి గత యేడాది నవంబర్ 2న 15వ అంతస్తు నుంచి పిల్లల్ని కిందకితోసేసి హతమార్చాడు. రెండేళ్ల జాంగ్ రిషు, ఏడాది వయసున్న జాంగ్ యాంగ్రుయ్ పిల్లలిద్దరూ భవనం పై నుంచి కిందపడగానే ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స సమయంలో మృతి చెందారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ ఈ ఘటనపై అతని మాజీ భార్య చెన్ మెయిలిన్ మాట్లాడుతూ, 'ఝాంగ్ బో విడాకులకు ముందే వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెను గర్ల్ ఫ్రెండ్‌గా అందరి ముందు నమ్మబలికాడు. ఆమె కోసమే నాకు విడాకులు ఇచ్చాడు కూడా. కుమార్తె సంరక్షణను ఆమె తల్లికి ఇవ్వాలని, కుమారుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి 6 ఏళ్లు వచ్చే వరకు ఇవ్వాలని కోర్టు విడాకుల సమయంలో ఆదేశించింది. చివరికి ఇంత పని చేశాడని పోలీసులకు చెబుతూ కన్నీరు మున్నీరయ్యింది ప్రియురాలికి కోర్టు ఇచ్చిన తీర్పు తెలియడంతో వెంటనే పిల్లల నుంచి విడిపోవాలని కోరింది. ఒక రోజు ఇద్దరు పిల్లలు జాంగ్ బోతో ఉన్న సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ వీడియో కాల్ చేసి చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జాంగ్ బో ఆగ్రహావేశాలతో పిల్లలిద్దరినీ భవనంపై నుంచి కింద పడేశాడు. తను నిద్రిస్తున్న సమయంలో పిల్లలు భవనంపై నుంచి పడిపోయినట్లు అందరికీ కట్టుకథ అల్లి చెప్పాడు. ఐతే పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. చదవండి: ‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే.. -
నిద్రలోనే కన్నుమూసింది..
మరో గంటలో నిద్రలేవాల్సిన ఆ చిన్నారి శాశ్వత నిద్రలోకి వెళ్లింది. మూడేళ్లకే మృత్యువు కబళించుకుపోయింది. ఇంటి పైకప్పే ఆ చిన్నారిపాలిట యమపాశమైంది. నిద్రిస్తున్న చిన్నారిపై విరిగి పడడంతో నిద్రలోనే మృతిచెందింది. ఈ సంఘటన ధర్మపురిలో గురువారం జరిగింది. ధర్మపురి: ఉదయం తెల్లవారుతోంది. మరో అరగంటలో అమ్మా అంటూ ఆ చిన్నారి తల్లి ఒడికి చేరేది. ఇంతలోనే ఘోరం జరిగింది. ఇంటి పైకప్పు కూలి ఆ చిన్నారి నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన ధర్మపురిలో గురువారం జరిగింది. చిన్నారి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన చిటన్నోజ్ వెంకన్న ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తుంటాడు. వచ్చేజీతం తిండి, బట్టకు సరిపోవడంతో ఏళ్లకాలంగా పురాతన ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఒకగదిలో వెంకన్న దంపతులు, మరో గదిలో తన కొడుకు లింగస్వామి అతడి భార్య పావని పిల్లలు లోకేష్ (5), సాత్విక (3)తో ఉంటున్నారు. రెండేళ్లక్రితం లింగస్వామి ఉపాధినిమిత్తం సింగపూర్ వెళ్లాడు. పావని పిల్లలతో అదే గదిలో ఉంటోంది. ఇదీ జరిగింది.. రోజూలాగే బుధవారం రాత్రి పావని పిల్లలతో తన గదిలో నిద్రించింది. గురువారం ఆరు గంటలకు నిద్రలేచి బయటకు వచ్చింది. ఇంతలో భారీ శబ్ధంతో వారుంటున్న గది పైకప్పు కూలింది. పావని లబోదిబోమంటూ స్థానికులను పిలుచుకొచ్చింది. అప్పటికే బెడ్‌పై పడుకున్న సాత్విక, లోకేశ్ మట్టిలో కూరుకుపోయారు. ఎలాగోలా ఇద్దరిని బయటకు తీశారు. లోకేశ్ దుప్పటి కప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. సాత్విక పూర్తిగా మట్టిలో కూరుకుపోవడంతో శ్వాస ఆడలేదు. వెంటనే జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్య లో మృతిచెందింది. దీంతో చేసేదేమీ లేక సాత్విక మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. వారం రోజుల్లో తండ్రి ఇంటికి.. సింగాపూర్ వెళ్లిన లింగస్వామి మరో వారం రోజుల్లో ఇంటికి వచ్చేవాడు. తండ్రి రాకకోసం పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సాత్విక ప్రమాదవశాత్తు మృతిచెందింది. విషయం తెలుసుకున్న లింగస్వామి సింగపూర్‌నుంచి బయల్దేరాడు. నేడు స్వగ్రామానికి చేరుకోనున్నాడు. ఆర్ఐ రంగారావు పంచనామా చేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో విషాదం ఆడుకుంటూ బస్సు వద్దకు వెళ్లిన నందిని వెనుక టైరు కింద పడి ప్రాణాలు వదిలిన చిన్నారి షాద్‌నగర్: తుళ్లుతూ, నవ్వుతూ ఆడుకుంటు న్న చిన్నారి.. ఆడుతూ ఆడుతూ ఇంటి బయటకు వెళ్లింది.. పిల్లలంతా స్కూలు బస్సు ఎక్కుతుంటే చూసి దాని దగ్గరికి వెళ్లింది.. ఇది చూడకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోనివ్వడంతో బస్సు వెనుక చక్రాల కిందపడి నలిగిపోయింది.. కన్నవారికి కన్నీటిని మిగుల్చుతూ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణంలోని కాకతీయ పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకొచ్చేందుకు శనివారం ఉదయం ఫరూఖ్‌నగర్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తూ మధ్యలో ఈద్గా ప్రాంతం లో మరి కొందరు విద్యార్థులను ఎక్కించుకునేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. ఆ పక్కనే నివాసముంటున్న కొత్త లక్ష్మయ్య, మానస దంపతుల కుమార్తె నందిని (2) ఆ సమయంలో ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చి.. బస్సు దగ్గరగా వెళ్లింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. దీంతో ఆ చిన్నారి బస్సు వెనుక టైరు కిందపడింది. ఒక్కసారిగా ఏదో శబ్దం రావడంతో డ్రైవర్, విద్యార్థులు బస్సు దిగి చూడగా.. చిన్నారి నందిని అప్పటికే ప్రాణాలు విడిచింది. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ ఉన్న తమ కుమార్తె మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి బలయిపోయిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే బస్సులో క్లీనర్ కూడా ఉండాలని... ప్రమాదానికి కారణమైన బస్సులో క్లీనర్ లేడని మండిపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు క్లీనర్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.