సుడిగాలి రేగింది.. అణగారిపోయింది..
సామర్లకోట :
సుడిగాలి గురించి చెప్పడమే కానీ, దాని ప్రత్యక్ష వీక్షణం మన ప్రాంతంలో చాలామందికి అరుదే. అమెరికావంటి దేశాల్లో వచ్చే భారీ స్థాయిలో రేగే సుడిగాలులను (టోర్నడోలు) సినిమాలు, వీడియోల్లో మాత్రమే చూస్తూంటాం. ఆ స్థాయిలో కాకపోయినా.. సామర్లకోటలో ఆదివారం రేగిన సుడిగాలి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్థానిక ఏడీబీ రోడ్డులోని ఓ లే–అవుట్లో ఉన్నట్టుండి ఇలా ధూళిని తోడుగా తీసుకుని గాలి సుడి తిరిగింది. అటుగా వెళ్తున్న పలువురు దీనిని ఆసక్తిగా తిలకించారు. కాసేపటి తరువాత ఆ గాలి దానంతట అదే అణగారిపోయింది. సాధారణంగా గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనం ఉన్నప్రదేశంలోకి చేరేటప్పుడు ఈవిధంగా సుడి తిరుగుతుంది.