98 స్మార్ట్ సిటీల జాబితా విడుదల
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 98 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించారు. రాబోయే ఆరేళ్లలో 6 లక్షల కోట్లు ఖర్చు చేసి స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతి స్మార్ట్ సిటీకి ప్రణాళిక కోసం రూన.2 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలు కేవలం ఐదు స్మార్ట్ సిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రాలకు కేటాయించిన స్మార్ట్ సిటీల జాబితా ఇదే:
ఉత్తరప్రదేశ్-13
తమిళనాడు-12
మధ్యప్రదేశ్-7
గుజరాత్-6
కర్ణాటక-6
మహారాష్ట్ర-10
ఆంధ్రప్రదేశ్-3
తెలంగాణ-2