Smart App
-
'స్మార్ట్ హోమ్స్' కు స్మార్ట్ యాప్
కోల్ కత్తా : భారత్ ను స్మార్ట్ సిటీలుగా రూపకల్పన చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ స్మార్ట్ సిటీలతో రూపకల్పనతో పాటు మన ఇల్లుల్ని కూడా స్మార్ట్ గా ఉంచాలని ఆకాంక్షించారు ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ హోమ్స్ కోసం, స్మార్ట్ యాప్ కు శ్రీకారం చుట్టారు. మొబైల్ స్క్రీన్ పై ఒక్క టచ్ చేస్తే చాలు, ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేలా 'అలైవ్ హోమ్' యాప్ ను టెక్నాలజీ యూజర్ల ముందుకు తీసుకొచ్చారు. ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ఐదో ఏడాది ఉత్సాహవంతులైన టెక్నాలజీ విద్యార్థులు పూనమ్ గుప్తా, అలోక్ దీక్షిత్ లు ఈ అప్లికేషన్ ను రూపొందించారు. స్మార్ట్ హోమ్ లోపలున్న ప్రతి పనిని నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇంట్లో ఉన్న ప్రతీ ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ల మొబైల్ డివైజ్ ద్వారా వాటిని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. కానీ అది ఎంతో ఖరీదైనది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పరంగా ఎక్కువ మందికి యాక్సెస్ లో ఉంచేలా ఈ యాప్ ను రూపొందించామని ఈ యాప్ సృష్టికర్తలో ఒకరైన అలోక్ దీక్షిత్ చెప్పారు. ఈ హై ఎండ్ టెక్నాలజీని తక్కువ ధరకే యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఉండే స్విచ్ బోర్డులకు బదులు ఈ యాప్ ద్వారా స్మార్ట్ స్విచ్ లను వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ కు ఈ యాప్ రిమోట్ కంట్రోల్ ల ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏసీని కాని, గ్రీసర్ ను కాని ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్ కు వచ్చేస్తే ఈ యాప్ యూజర్లకు నోటిఫికేషన్ అలారమ్ ఇస్తుంది. ఈ అలారమ్ తో ఆఫీసు నుంచే వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించి లైట్లు వేస్తే ఈ యాప్ లోని స్మార్ట్ స్విచ్ ఆప్షన్ వల్ల వెంటనే యూజర్లకు తెలిసిపోతుంది. గతేడాది నుంచి ఈ యాప్ రూపొందించడానికి ఐఐటీ విద్యార్థులు అహర్నిశలు కృషిచేశారు. దీనిపై వారు పేటెంట్ ను కూడా దాఖలు చేసుకున్నారు. ఈ యాప్ ఇన్ స్టాలేషన్ ద్వారా ఖరగ్ పూర్ ఐఐటీని కూడా స్మార్ట్ క్యాంపస్ గా తీర్చిదిద్దారు. -
ఇంక్యుబేటర్ బేబీ కష్టాలకు చెక్ చెప్పే 'యాప్'
తల్లి గర్భంలో ఉన్న పిల్లలు బయట నుంచి అమ్మ మాటలను, శబ్దాలను వింటూ హాయిగా బొజ్జుకుంటారట. ఆ మాటలు,శబ్దాలే గర్భంలో పెరిగే పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయట. భారతంలో అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలోనే పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని వర్ణించారు కూడా. ఇలా పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎదుగుదలకు తల్లి మాటలు ఎంతో సహాయపడతాయట. అయితే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఆ మాటలు వినడానికి అవకాశముండదు. వారిని సంరక్షించడానికి ఎక్కువ కాలం ఇంక్యుబేటర్ లోనే ఉంచుతారు. అమ్మ మాటలు ఆలకించడానికి వారికి ఛాన్స్ కూడా ఉండదు. వీరి కోసమే కొత్తగా రూపొందింది వాయిస్ ఆఫ్ లైఫ్ యాప్. టెక్ దిగ్గజం సామ్ సంగ్ ఈ యాప్ ను ఆవిష్కరించింది. ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు తల్లి మాటలను, హార్ట్ బీట్ ను వినిపించి, వారి బ్రెయిన్ ను డెవలప్ చేయడానికి ఈ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. తల్లి హార్ట్ బీట్ ను, మాటలను ఆ యాప్ లో రికార్డు చేసి, ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు వినిపించేలా దీన్ని డెవలప్ చేశారు. ఒకవేళ రికార్డు అయిన శబ్దాలలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని ఈ యాప్ తొలగించి, ఇంక్యుబేటర్ లోపల ఉన్న పిల్లలకు వినిపించేలా సెట్ చేసింది సామ్ సంగ్ సంస్థ. దీనివల్ల నెలలు నిండక ముందు పుట్టిన బేబీలు కూడా తల్లి మాటల వినే అనుభూతిని పొందుతారని హర్వర్డ్ మెడికల్ స్కూల్ పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిర్ లాహవ్ చెప్పారు. తల్లి గర్భానికి, ఇంక్యుబేటర్ వాతావరణం చాలా వేరుగా ఉంటుందని .. ఈ యాప్ ద్వారా పిల్లలు మెదడును ఆరోగ్యకరంగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అయి, తల్లి గర్బంలో నుంచి బయటికి వచ్చిన పిల్లలకు భయం, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని,ఈ యాప్ ద్వారా వాటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.గతేడాది నెలలు నిండక ముందు జన్మించిన పిల్లలు దాదాపు 150 లక్షల పైమాటేనని ఆయన చెప్పారు. ఈ యాప్ ను రూపొందించడంలో డాక్టర్ అమిర్ శ్యామ్ సంగ్ కు ఎంతో కృషిచేశారు. -
స్మార్ట్ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ
- ఏపీ డీజీపీ జేవీ రాముడు పుట్టపర్తి టౌన్ (అనంతపురం) హైదరాబాద్ తరహాలో స్మార్ట్ యాప్ ద్వారా రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర డిజిపి జెవి.రాముడు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు.. జిల్లాలో పర్యటించిన ఆయన తన స్వగ్రామం అయిన నార్సింపల్లి లో చేపట్టనున్న అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు స్మార్ట్ యాప్‌ను ప్రవేశ పెట్ట నున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద అనంతపురంను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.