లావా కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ‘వి5’
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘లావా’ తాజాగా ‘వి5’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.11,499. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3 జీబీ ర్యామ్, 13 రియర్ ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో 7-8 కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది.