సోషియల్, బయాలజీ పోస్టులు భర్తీ చేయాలి
అనంతపురం న్యూసిటీ : తమ పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషియల్, బయాలజీ పోస్టులను భర్తీ చేయాలని శారద మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం రమాదేవి కమిషనర్ చల్లా ఓబులేసును కోరారు. ఈ మేరకు గురువారం కమిషనర్‌కు కలిసిన హెచ్ఎం, అధ్యాపక బృందం ఓ వినతి పత్రం అందజేశారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారు.