Sodium chloride
-
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
వేడి చేసినప్పుడు సంకోచించే లోహం?
ఘన, ద్రవ, వాయు స్థితులతోపాటు పదార్థ నాలుగో స్థితి ప్లాస్మా. సిల్వర్, హైడ్రోజన్, నైట్రోజన్ వంటి వాటిలో ఒకే రకమైన పరమాణువులుంటాయి. అవి మూలకాలు. నీరు, గ్లూకోజ్, సుక్రోజ్ (చక్కెర), టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్) వంటివి సమ్మేళనాలు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ మూలకాల పరమాణువులుంటాయి. గాలి (ప్రధానంగా నైట్రోజన్ (78%), ఆక్సిజన్ (20%), కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్), బంగారు ఆభరణాలు, చక్కెర ద్రావణం వంటివి మిశ్రమాలు. వీటిలోని అనుఘటకాలను సులభంగా వేరుచేయొచ్చు. అయోడిన్, గ్రాఫైట్, డైమండ్లు అలోహాలైనా లోహాల్లా మెరుస్తాయి. అయోడిన్, కాంఫర్లు ఉత్పతనం చెందుతాయి. అంటే ఘన స్థితి నుంచి నేరుగా వాయువుగా మారతాయి. సాధారణంగా లోహాలు ఘన పదార్థాలు. కానీ మెర్క్యురీ, గాలియం, సీసియం, ఫ్రాన్షియంలు కూడా దాదాపు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉంటాయి. ఫాస్ఫరస్ పొడి గాలిలో మండుతుంది. అందువల్ల దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. రీచార్జబుల్ బ్యాటరీల్లో లిథియంను, మానసిక చికిత్సలకు లిథియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా (మెగ్నీషియం హైడ్రాక్సైడ్) ఆమ్ల విరోధిగా, విరేచనకారిగా పనిచేస్తుంది. పాలను చీజ్‌గా మార్చడంలో, రక్తం గడ్డకట్టడంలో కాల్షియం తోడ్పడుతుంది. శరీరంలో 99% కాల్షియం ఎముకలు, దంతాల్లో ఉంటుంది. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో, దంత ఎనామిల్‌లో హైడ్రాక్సీ ఎపటైట్ రూపంలో ఉంటుంది. కిడ్నీలో ఏర్పడిన రాళ్లలో ప్రధానంగా ఉండేది కాల్షియం ఆక్సలేట్. కాల్షియం శోషణకు సూర్యరశ్మి ఆధారిత విటమిన్-డి చాలా అవసరం. క్లోరోఫిల్‌లో మెగ్నీషియం; రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్; సయనోకోబాలమిన్ (విటమిన్ ఆ12)లో కోబాల్ట్ లోహ అయాన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఎక్స్ కిరణ ఇమేజింగ్‌లో బేరియం మీల్‌గా, బేరియం సల్ఫేట్‌ను ఉపయోగిస్తారు. ఫుల్లరీన్.. సాకర్ బాల్ నిర్మాణంలో ఉంటుంది. సహజ రబ్బరుకు గట్టిదనం కోసం సల్ఫర్‌ను కలిపి వేడిచేసే ప్రక్రియను వల్కనైజేషన్ అంటారు. నూనెలను నికెల్ లోహం ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో క్షయకరణం (హైడ్రోజనీకరణం) చేసి వనస్పతి (డాల్టా)గా మార్చుతారు. ఇనుము వంటి లోహాలు తుప్పుపట్టకుండా జింక్ లోహంతో పూత పూసే ప్రక్రియ గాల్వనైజేషన్. ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆక్సీకరణం చెంది బరువు పెరుగుతూ ఐరన్ ఆక్సైడ్‌గా మారుతుంది. భూ పటలంలో సమృద్ధిగా లభించే లోహం అల్యూమినియం. ఆ తర్వాతి స్థానం ఇనుముది. లేత పసుపు వర్ణ వీధి దీపాల్లో సోడియం ఆవిరి, సాధారణ ట్యూబ్‌లైట్లలో మెర్క్యురీ ఆవిరి ఉంటాయి. సున్నపురాయి, పాలరాయి (మార్బుల్), ముత్యంలో కాల్షియం కార్బొనేట్ (ఇ్చఇై3) ఉంటుంది. కెంపులో అల్యూమినియం ఆక్సైడ్‌తోపాటు మలినంగా క్రోమియం ఉంటుంది. ఎమరాల్డ్‌లో బెరీలియం ఉంటుంది. కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం లోహ (అయాన్ల) కార్బొనేట్లు, క్లోరైడ్లు, సల్ఫేట్లు ఉంటాయి. సముద్ర జలం (కఠినజలం) నుంచి స్వాదుజలాన్ని పొందడానికి అనువైన ప్రక్రియ తిరోగామి ద్రవాభిసరణం (Reverse Osmosis - R.O). గాగుల్స్‌కు ఉపయోగించే రంగు అద్దాల్లో ఫై ఆక్సైడ్ ఉంటుంది. సాధారణంగా అయానిక పదార్థాలు స్ఫటికాకృతిని కలిగి ఉంటాయి. కానీ డైమండ్, ఐస్‌లు సమయోజనీయ స్ఫటికాలు. బాగా సాగే గుణం ఉన్న లోహం బంగారం. ఇనుముకు తుప్పు పట్టే గుణం అధికం. స్టీలు (ఉక్కు)గా మార్చాక తుప్పు పట్టకపోవడానికి కారణం అందులో ఉండే క్రోమియం. ఆరోగ్యవంతమైన దంతాల కోసం కాల్షియంతోపాటు ఫాస్ఫరస్, ఫ్లోరైడ్ కూడా అవసరమే. టూత్‌పేస్ట్‌లలో కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్‌లను ఉపయోగిస్తారు. మంటలను ఆర్పే సాధనాల్లో సోడియం కార్బొనేట్, పొటాషియం కార్బొనేట్లు ఉంటాయి. ఇవి ఆమ్లంతో కలిసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి. బేకింగ్ సోడా యాంటిసెప్టిక్‌గా, ఆమ్ల విరోధిగా కూడా పనిచేస్తుంది. వాటర్ గ్లాస్ అనేది - సోడియం సిలికేట్ జిప్సం (కాల్షియం సల్ఫేట్ డై హైడ్రేట్- నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తయారు చేస్తారు. రేడియోధార్మిక పదార్థాలు ఆల్ఫాబీటా (ఛ), గామా (జ) కిరణాలను ఉద్గారం చేస్తాయి. కోబాల్ట్-60 ఐసోటోప్ ఆధారిత గామా కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ చేస్తారు. అణు బాంబులోని సూత్రం కేంద్రక విచ్ఛిత్తి. యురేనియం-235 వంటి అస్థిర కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే కేంద్రకం విఘటనం చెందడంతోపాటు అపారశక్తి విడుదలవుతుంది. ఈ ‘శృంఖల కేంద్రక విచ్ఛిత్తి చర్య’ను నియంత్రించి న్యూక్లియర్ రియాక్టర్లలో అణు విద్యుచ్ఛక్తిని పొందుతారు. ఇంధనాలుగావాడతారు న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిగా భారజలం (ఈ2ై)ను వాడతారు. న్యూట్రాన్ల సంఖ్యను నియంత్రించేందుకు బోరాన్, కాడ్మియం కడ్డీలను వాడతారు. హైడ్రోజన్ బాంబు, సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తికి మూలాధారం కేంద్రక సంలీనం. భూపొరల్లో సమృద్ధిగా లభించే మూలకాలు వరుసగా ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం. ఘన కార్బన్ డై ఆక్సైడ్‌ను పొడి మంచు (ఈటడ ఐఛ్ఛి) అంటారు. అల్యూమినియం పొడి, అమోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు. ఇది పేలుడు పదార్థం. డైమండ్.. ఉష్ణ, విద్యుత్ వాహకం కాదు. బంగారం, ప్లాటినంల చర్యాశీలత తక్కువ. ఇవి నోబుల్ మెటల్స్. ప్రకృతిలో సహజ స్థితిలో లభిస్తాయి. లోహాల్లో వెండి (సిల్వర్ - అజ) మంచి విద్యుద్వాహకం. అల్యూమినియం ఆక్సైడ్ రూపంలోని ధాతువు బాక్సైట్. దీన్నుంచే అల్యూమినియాన్ని వ్యాపార సరళిలో సంగ్రహిస్తారు. రాగి సల్ఫైడ్ రూపంలోని ఖనిజం కాపర్ పైరటీస్. రేడియోధార్మిక యురేనియం ఖనిజం పిచ్‌బ్లెండ్. భారతదేశంలో విరివిగా లభించే మోనజైట్ ఇసుక నుంచి రేడియోధార్మిక థోరియం లభిస్తుంది. సీసం ఖనిజం - గెలీనా; మెగ్నీషియం- డోలమైట్, మాగ్నసైట్; ఐరన్- హెమటైట్, మాగ్నటైట్. ఇనుము సంగ్రహణలో ఉపయోగించే బ్లాస్ట్ కొలిమిలో ఐరన్ ఆక్సైడ్, ఐరన్‌గా క్షయకరణం చెందడానికి కార్బన్ మోనాక్సైడ్ ఉపయోగపడుతుంది. బ్లాస్ట్ కొలిమిలో, మొదట 750నిఇ వద్ద లభించే గుల్లబారిన ఘన స్థితిలోని ఐరన్‌ను స్పాంజ్ ఐరన్ అంటారు. 1500నిఇ వద్ద కొలిమి అడుగున ద్రవ స్థితిలో ఉండే ఐరన్‌ను దుక్క ఇనుము లేదా పోత ఇనుము అంటారు. కార్బన్ శాతం గరిష్టంగా (34%) ఉన్నది దుక్క ఇనుము. కార్బన్ శాతం అతి తక్కువ (0.5% కంటే స్వల్పం) ఉన్న శుద్ధమైన ఇనుము.. చేత ఇనుము. ఇనుములో కార్బన్ శాతం పెరిగితే పెళుసుదనం ఎక్కువవుతుంది. స్టీల్ అనేది ఐరన్‌తో కూడిన మిశ్ర లోహం. కార్బన్ తప్పనిసరిగా 0.11.5% వరకు ఉంటుంది. స్టీల్‌కు స్థితిస్థాపకత ఎక్కువ. ఇనుము, నికెల్, క్రోమియం, మాంగనీస్ కలిసి ఉన్న మిశ్ర లోహం నిక్రోమ్. దీన్ని హీటర్ల ఫిలమెంట్ తయారీలో ఉపయోగిస్తారు. ాపర్, జింక్, నికెల్‌ల మిశ్ర లోహం జర్మన్ సిల్వర్ (సిల్వర్ ఉండదు). దీన్ని పాత్రలు, నిరోధక చుట్టల తయారీలో వాడతారు. ఇమిటేషన్ జ్యుయలరీలో ఉపయోగిస్తారు. ఫ్యూజ్వైర్ల తయారీకి టిన్+లెడ్ ఉపయోగిస్తారు. ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ నేటికీ తుప్పు పట్టకపోవడానికి కారణం అందులోని అధిక ఫాస్ఫరస్ శాతం. ఇత్తడి - కాపర్, జింక్; కంచు - కాపర్, టిన్ల మిశ్ర లోహాలు. ప్రపంచంలో తయారు చేసిన మొదటి మిశ్ర లోహం కంచు (బ్రాంజ్). మానవుడు ఉపయోగించిన తొలి లోహం - రాగి (కాపర్) సిల్వర్ పెయింట్‌లో ఉండే లోహం- అల్యూమినియం. సోల్డర్ మెటల్‌లోని లోహాలు - తగరం (టిన్), సీసం (లెడ్). రేడియోధార్మికత నుంచి రక్షణకు లెడ్ ఉపయోగపడుతుంది. వేడి చేసినప్పుడు సంకోచించే లోహం - జిర్కోనియం. అరటి పండు నుంచి లభించి రక్తపోటును నియంత్రించే క్షార లోహం పొటాషియం. రక్తం ప్లాస్మాలో కాల్షియం అయాన్లు ఉంటాయి. బంగారు నగల తయారీలో గట్టిదనం కోసం కాపర్ కలుపుతారు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు. ఒక క్యారెట్ 100/24 శాతానికి సమానం. 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం 91.7. దంతాల్లోని రంధ్రాలను ఫిల్లింగ్ చేయడానికి సిల్వర్, టిన్, మెర్క్యురీ, జింక్‌ల మిశ్రమాన్ని వాడతారు. మిర్రర్ల కళాయి పూతలో ఉపయోగించే లోహం సిల్వర్. హెల్మెట్ల తయారీలో మాంగనీస్ స్టీల్‌ను ఉపయోగిస్తారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు యురేనియం-238ని ఉపయోగించుకొని, ప్లుటోనియం-239ని ఉత్పత్తి చేస్తాయి. చెట్లు, శిలాజాల వయసును కార్బన్-14 ఐసోటోప్ ఆధారిత రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా నిర్ధారిస్తారు. థైరాయిడ్, గాయిటర్ చికిత్సతోపాటు మెదడులోని కణుతులను గుర్తించడానికి అయోడిన్-131 ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు. బయోగ్యాస్, సహజ వాయువు, గోబర్ గ్యాస్‌లో ప్రధాన హైడ్రోకార్బన్ మీథేన్. బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలకు కారణం మీథేన్ (ఫైర్డ్యాంప్). మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ అనేవి పరమాణు భారం పెరిగే క్రమంలో (వరుసగా) మొదటి నాలుగు హైడ్రోకార్బన్లు. సీఎన్జీలో సంపీడనం చెందించిన మీథేన్ ఉంటుంది. ఎల్పీజీ, సిగరెట్ లైటర్‌లో బ్యూటేన్ ఉంటుంది. ఇథిలీన్కు కాయలను త్వరగా పక్వం చెందించే గుణం ఉంటుంది. కాల్షియం కార్బైడ్ తేమ సమక్షంలో ఎసిటలీన్ విడుదల అవుతుంది. ఇది కూడా కాయలను పక్వం చెందిస్తుంది. కానీ ఇది హానికరం. ఎసిటలీన్‌ను వెల్డింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఎసిటికామ్ల విలీన ద్రావణమే వెనిగర్. మాంసం త్వరగా కుళ్లకుండా వెనిగర్ వాడతారు. చీమ, తేనెటీగ కుట్టినప్పుడు ఫార్మికామ్లం విడుదలవుతుంది. ఇథనాల్‌ను ధర్మామీటర్లలో, రాకెట్ ప్రొపెల్లెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. ఉడ్ స్పిరిట్ అంటే మిథైల్ ఆల్కహాల్. దీన్ని సేవిస్తే కంటిచూపు పోవడం, మరణం సంభవిస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే లివర్ దెబ్బతిని సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఘనీభవన స్థానం తక్కువ కారణంగా ఇథిలీన్ గ్లైకాల్‌ను వాహనాల రేడియేటర్లలో (నీరు గడ్డకట్టకుండా) యాంటీ ఫ్రీజ్‌గా వాడతారు. మాయిశ్చరైజింగ్ సబ్బుల్లో ఉండేది గ్లిజరాల్. ఫార్మలిన్ (ఫార్మాల్డిహైడ్ విలీన ద్రావణం) ను స్పెసిమెన్స (మృత కళేబరాలు, భాగాల)ను భద్రపర్చడానికి వాడతారు. -
నేను మీ కిడ్నీని
నేను ఆనంద్ కవల కిడ్నీని. నడుములోని వెన్నుపూసకు ఇరుపక్కలా ఇద్దరం ఉంటాం. నేను మూత్రం తయారీకి మాత్రమేనని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఆనంద్ శరీరమంతటికీ నేనే మాస్టర్ కెమిస్ట్‌ను. అంతేకాదు... శరీరంలోని ఎర్ర రక్తకణాల ఉత్పాదనలో నాకూ వాటా ఉంది. శరీర భాగాలన్నింటిలోనూ ఎక్కువ రక్తం అందేది మెదడుకు అని అందరూ అనుకుంటుంటారు. ఇది కొద్దిమేరకు మాత్రమే వాస్తవం. నిజానికి ఎక్కువ రక్తం నాలోంచే ప్రవహిస్తుంటుంది. శరీరంలోని నీటి సరఫరాను నేనే నియంత్రిస్తుంటాను. రక్తంలోని పొటాషియమ్, సోడియమ్ క్లోరైడ్ మోతాదులను సరిచూసేదీ నేనే. ఆకారం చిన్నది... పని పెద్దది నా బరువు కేవలం 140 గ్రాములే కానీ... నేను చేసే పనులను ఒక పట్టికలా రాసినా... ఒక పట్టాన అది పూర్తి కాదు. ఒకవైపు నేనూ, మరోవైపు నా హలోబ్రదర్... ఇద్దరం కలిసి వడపోత పనిని చేస్తుంటాం. నాలో కనీసం పది లక్షల వడపోత యూనిట్లు పనిచేస్తుంటాయి. ఒక్కో యూనిట్‌ను నెఫ్రాన్ అంటారు. ఇది సన్నటి తీగలుగా, చుట్టలు చుట్టినట్లుగా ఉంటుంది. తోకలాంటి ఈ సన్నటి పైపునకు ఒక తల కూడా ఉంటుంది. తీగలుగా చుట్టున ఒక పైపును సాగదీస్తే అది కనీసం 105 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇంత పొడవుండే సన్నటి తీగల ద్వారా కొనసాగే ఈ వడపోత ఎంత నిరంతరాయం సాగుతుందో వివరించాలంటే తనకు తెలికుండా నేను ఆనంద్ ఒంట్లో చేసే ఒక అద్భుతం గురించి చెప్పాలి. అదేమిటంటే... ఆనంద్ ఒంట్లో ఆరు లీటర్ల రక్తం ఉందనుకుందాం. మేమిద్దరమూ కలిసి గంటకు 12 లీటర్ల రక్తాన్ని వడపోస్తాం. అంటే ఆనంద్ శరీరంలో ఉన్న మొత్తం రక్తానికి రెట్టింపు ఫిల్టర్ చేస్తాం. చక్కెర బయటకు పోదు... పొటాషియమ్ తగ్గద ఇంత జరుగుతున్నా శరీరంలోని అమైనో యాసిడ్స్, విటమిన్లు, చక్కెర లాంటి వాటిని బయటకు వెళ్లనివ్వం. ఇలా దేహంలో ఎన్నో వైపరిత్యాలు, అనర్థాలూ జరగకుండా మేం నిత్యం ఆపుతుంటాం. వడపోసిన పదార్థాల్లో మళ్లీ అవసరమైన వాటిని 99 శాతాన్ని తిరగి శరీరానికి అందిస్తుంటాం. కేవలం వ్యర్థాలను మాత్రమే మూత్రం రూపంలో బయటకు పోనిస్తాం. ఒకవేళ ఆనంద్ రెండు పెద్ద పెద్ద పేస్ట్రీలు తిని... తాను డయాబెటిస్ పేషెంట్ అని తన డాక్టర్‌ను నమ్మించడానికి ప్రయత్నిస్తే ఆనందే ఫూల్ అవుతాడు. ఎందుకంటే చక్కెరలను నేను అంత తేలిగ్గా బయటకు పోనివ్వను. కానీ తాను రుచి కోసం అధిక మోతాదులో తీసుకున్న ఉప్పు అంతా రక్తంలోనే ఉండిపోతుందని ఆనంద్ నమ్మితే... అతడు ఉప్పులో కాలేసినట్టే! చక్కెరలనంటే బయటకు పోనివ్వలేదుగానీ పిడుక్కీ, బియ్యానికీ లాగా... ఉప్పులకూ, చక్కెరకూ నేను ఒక్కటే మంత్రం పఠిస్తే ఆనంద్ చచ్చూరుకుంటాడు. ఆ ఉప్పు శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తం చిక్కబడుతుంది. ఆనంద్ రక్తాన్ని పంప్ చేయడానికి అతడి గుండె ఎంతో కష్టపడుతుంది. ఆనంద్ కడుపు నిండా తింటూ, పళ్లరసాలూ అవీ తాగుతూ తగినంత పొటాషియమ్ తీసుకుంటూ ఉంటే పర్లేదు. అతడి కండరాలు సక్రమంగా పనిచేయడానికి అది కావాలి. అతడు తన ఆహారం ద్వారా తగినంత పొటాషియమ్ తీసుకోవడం లేదనుకోండి. నేనో పిసినారిలా దాన్ని వాడుతుంటా. విపరీతమైన శ్రమ... నిరంతరమైన పని ఆనంద్ శరీరంలోంచి నేను బయటకు తోడివేసే ప్రధానమైన వ్యర్థం ‘యూరియా’. మనం తీసుకునే ప్రోటీన్లు జీర్ణమయ్యే ప్రక్రియలో మిగిలిపోయే పదార్థమిది. ఇది శరీరంలో ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ మిగిలిపోయిందా... ఇక అంతే సంగతులు. మొదట నీరసం. తర్వాత నిదానంగా కోమా. చివరికి మరణం. అందుకే యూరియా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడతాను. కిడ్నీలో రిజర్వాయర్ కనీసం రోజుకు ఒక లీటర్‌కు తగ్గకుండా మూత్రాన్ని తయారు చేస్తాం. నెఫ్రాన్ల నుంచి నిరంతర రక్తప్రవాహం కొనసాగి... అది చివర్లో ఒక అద్భుతమైన అత్యంత సూక్ష్మమైన రిజర్వాయన్లోకి తెరచుకుంటుంది. అది సరిగ్గా నా మధ్యలో (కిడ్నీ సెంటర్లో) ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి మూత్రసంచి (బ్లాడర్) కి మళ్లీ నీటి పారుదల దారులుంటాయి. వీటి ద్వారా ప్రతి 10-30 సెంకడ్లకు ఒకసారి వ్యర్థాలను బయటకు నెడుతుంటాను. పగటితో పోలిస్తే... రాత్రి కాస్త మందకొడిగా పనిచేస్తుంటా. లేకపోతే మూత్రశాలకు వెళ్లడానికంటూ ఆనంద్ ప్రతి గంటకూ ఒకసారి లేవాల్సి ఉంటుంది. పెరిగే వయసు... తగ్గే పనితీరు ఆనంద్‌కు 47 ఏళ్లు నిండాక... మెల్లగా నాలోనూ వయసు పెరగడం మొదలవుతుంది. నా చుట్టూ ఉండే కొవ్వు పడక మీద నేను శయనించి ఉంటాను. ఒకవేళ ఏదైనా సమస్యతో ఈ కొవ్వు పడక కరిగితే... అప్పుడు నేను పక్కకు జరుగుతాను. ఒక్కోసారి నాలో రాళ్లు కూడా పేరుకుపోతాయి. ఈ రాళ్లు క్యాల్షియమ్, యూరిక్ యాసిడ్‌తో తయారవుతాయి. రోడ్డు మీద కంకర ఉంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లుగా ఈ రాళ్ల వల్ల మూత్రప్రవాహానికి అడ్డుకలుగుతుంది. అది చిన్న రాయి అయితే చిదిమినట్లుగా అయిపోవడం, లేదా కిందికి జారిపోవడం జరుగుతుంది. కానీ కంకరరాయి ఎంత పెద్దదయితే అడ్డంకి అంతగా పెరుగుతున్నట్లుగానే... నాలోని రాయితోనూ అలాంటి ప్రమాదమే ఉంటుంది. అది బఠాణీ గింజ అంత కావచ్చు. లేదా ఒక్కోసారి ద్రాక్షపండు అంత పెరగవచ్చు. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్లను పారతో పక్కకు తీసేసినట్టే, నాలో అంతగా పెరిగిన రాళ్లనూ సర్జరీతో తొలగించాలి. లేదంటే రాయి సైజు మరీ పెద్దదయితే రిజర్వాయర్‌లో ఇరుక్కుపోతుంది. రాయి నాలోని రిజర్వాయర్ లోంచి బ్లాడర్‌లోకి జారి మూత్రప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. రిజర్వాయర్‌కు లేదా బ్లాడర్ గోడలకు గానీ గాయం కావచ్చు. అదే జరిగితే ఇన్ఫెక్షన్ విలన్లా పొంచి ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది తన సామ్రాజ్యాన్ని రిజర్వాయర్ నుంచి కిందకు విస్తరించవచ్చు. అందుకే రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే... ఆనంద్ ద్రవాహారం ఎక్కువగా కావాలి. నేను సరిగా పనిచేయడం లేదని ఎలా తెలియాలి ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే యాక్సిడెంట్లలోనూ నేను గాయపడవచ్చు. లేదా ఒక్కోసారి నాలోని రక్తనాళాలూ తెగవచ్చు. ఇవేమి జరిగినా నాకు కలిగే ప్రమాదం తాత్కాలికమే. ఎందుకంటే కోలుకునే శక్తి నాలో అపారం. అయితే ఒక్కటి... వయసు పెరుగుతున్న కొద్దీ నాలోకి ప్రవహించే రక్తనాళాలు గట్టిపడవచ్చు, సన్నబడవచ్చు. వాటి మృదుత్వం తగ్గవచ్చు. ఆనంద్ గుండె పంపింగ్ సామర్థ్యమూ తగ్గవచ్చు. అప్పుడు నాలోకి వచ్చే రక్తప్రవాహ వేగం తగ్గవచ్చు. నాలో వ్యర్థాలూ పోగుపడవచ్చు. అప్పుడు నేను రక్తంలోని లవణాల పాళ్లను సక్రమంగా నియంత్రించలేకపోవచ్చు. ఇది ఆనంద్‌లోని మొదలైంది. అదృష్టవశాత్తూ నాకు ఒక అన్నదమ్ముడున్నాడు. వాడు నాకు తోడు వస్తాడు. మేమిద్దరమూ కలిసి, ఆనంద్ శరీరానికి అవసరమైన పనిని చేయగలుగుతాం. ఇంతకు ముందు తగినన్ని మందులు లేవుగానీ... ఇప్పుడు మమ్మల్ని బాగు చేయగల మందులూ ఉన్నాయి. మాకు రాబోయే సమస్యను ముందే తెలుసుకోగల పరీక్షలూ ఉన్నాయి. మాకు చెరుపు చేసే ఎన్నో సమస్యల్ని నివారించే జాగ్రత్తలూ ఉన్నాయి. ఇంతెందుకు ఆనంద్ తన బరువును నియంత్రించుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండే చాలు. బాగా వ్యాయామం చేస్తే చాలు. నాకు రాబోయే ఎన్నో అనర్థాలు నివారితమవుతాయి. నేను ఉత్పత్తి చేసే మూత్రం రంగును గుర్తించినా, అతడి ముఖం ఉబ్బుగా ఉన్నా, కళ్లు మసకబారుతున్నా, ఒళ్లు బలహీనంగా అనిపించినా గమనిస్తే... నేను అరుస్తున్న అరుపు అతడికి వినిపించినట్టే. జరగబోయే చెరుపు దూరమైనట్టే. - ఇన్పుట్స్: డాక్టర్ పి. నాగేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ మూత్రపిండం మరికొన్ని వాస్తవాలు... కొన్ని సందర్భాల్లో కొందరు రోగుల్లో పాలకూర మాత్రమే కాదు... పాలు కూడా కిడ్నీలో రాళ్లుగా మారవచ్చు. మనిషి బతకడానికి కేవలం 75 శాతం పనితీరుతో ఒక కిడ్నీ ఉంటే చాలు. కిడ్నీలు రక్తపోటునూ అదుపులో ఉంచుతాయి. కిడ్నీ కంప్యూటర్ మౌస్ అంత ఉంటుంది. కానీ కంప్యూటర్లోని చిప్స్ కంటే సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. విటమిన్ ‘డి’ ఉత్పాదనను స్టిమ్యులేట్ చేసేది కిడ్నీయే. కిడ్నీ పనితీరు పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే జబ్బును ‘ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్’ (ఈఎస్ఆర్డీ) అంటారు. కిడ్నీలు దెబ్బతినవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధపడే జబ్బును క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. రక్తపోటు సరిగా ఉన్నప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుభ్రపరిచే ప్రక్రియను ‘డయాలసిస్’ అంటారు. అదే రక్తపోటు అస్థిమితంగా ఉన్నప్పుడు కూడా రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ‘కంటిన్యువస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ’ అంటారు. మందుబాబులూ జాగ్రత్త! మద్యం తాగినప్పుడు కిడ్నీ ఎక్కువగా పనిచేసి మూత్రాన్ని ఎక్కువగా బయటకు పంపాల్సి వస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు పోతుంది. అది చాలా ప్రమాదం కదా. అందుకే అప్పుడు పిట్యూటరీ గ్రంథి రంగంలోకి దిగుతుంది. ‘యాంటీ-డైయూరెటిక్’ హార్మోన్‌ను వెలువరిస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్లకుండా ఉంటుంది. కానీ ఎంత డైయూరెటిక్ హార్మోన్ ఉత్పత్తి అవుతున్నా... ఆల్కహాల్ ఎక్కువతే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ తగ్గుతుంది. ఒక్క మద్యంతోనే ఈ ప్రమాదమని అనుకుంటున్నారా? కాఫీ తాగినా అంతే. సిగరెట్‌తోనూ సేమ్ యాక్షన్.