3న జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ సెలక్షన్స్
వరంగల్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సీనియర్స్ సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సెప్టెంబర్ 9 నుంచి నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.