పేరు మారింది!
తమిళసినిమా: సినిమాలకు మొదట పెట్టిన పేర్లను ఆ తరువాత మార్చడం అన్నది సాధారణ విషయమే. అదే విధంగా ఇప్పుడు నటుడు అర్జున్ వారసురాలు ఐశ్వర్యాఅర్జున్ నాయకిగా నటిస్తున్న చిత్రం పేరు మారింది. యాక్షన్‌కింగ్‌గా పేరొందిన అర్జున్ తన కూతురు ఐశ్వర్యను నాయకిగా ప్రమోట్ చేసే విధంగా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలతో పాటు, నిర్మాణ బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని శ్రీరామ్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి కాదలిన్ పొన్ వీధియిల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్‌కు జంటగా చందన్ అనే నూతన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. కే.విశ్వనాథ్, నటి సుహాసిని, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి ద«శకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రానికి సొల్లివిడవా అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే చిత్ర ఆడియో, చిత్ర విడుదల తేదీల గురించి వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.ఈ చిత్రానికి జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇది యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందట.అందులోనూ మంచి కామెడీ, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. కాగా ఐశ్వర్యాఅర్జున్ ఇంతకు ముందు విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైందన్నది గమనార్హం.అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో సొల్లివిడవా చిత్రం ఐశ్వర్యాఅర్జున్కు చాలా కీలకం అవుతుందని చెప్పవచ్చు.