'సమైక్య ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారింది'
సమైక్యాంధ్ర ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారుతుందని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ... అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత మంది సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు అమ్ముడు పోయారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజాసంఘాలే భుజస్కంధాలపైకి తీసుకోవాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా కారెం శివాజీ గుర్తు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవశ్యకత ప్రజా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా కారెం శివాజీ పేర్కొన్నారు.