సోమ తన్వీకి మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సోమ తన్వీ మూడు పతకాలు సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం ఉన్నాయి. గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీల్లో 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో జూనియర్ మహిళలు, యూత్ మహిళల కేటగిరీలో ఒక్కో పసిడి పతకాన్ని గెలుచుకుంది. మహిళల ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని చేజిక్కించుకుంది.
ఇతర ఫలితాలు
10 మీ. ఎయిర్ రైఫిల్ జూనియర్ పురుషుల కేటగిరీ: 1. అమన్ వర్మ, 2. అమన్ నాయక్, 3. పరాశర్ రాణా; 10 మీ. పురుషులు: 1. దిక్కాల నిమీశ్, 2. అభిలాష్ రెడ్డి; 10 మీ. యూత్ పురుషులు: 1. దిక్కాల నిమీశ్; 2. సూరజ్ రెడ్డి; 10 మీ. ఎయిర్ పిస్టల్ పురుషులు: 1. హమీద్ హుస్సేన్, 2. అనురాగ్ గౌతమ్, 3. సుశీల్ జిల్లా; పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. ఖాద్రీ, 2. అబ్దుల్ షాహిద్, 3. శ్యామ్; మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. అనూష, 2. సువర్ణ, 3. సంయుక్త స్వామి; జూనియర్ పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. అబ్దుల్ షాహిద్, 2. షేక్ మొహమ్మద్, 3. సయ్యద్ మొహమ్మద్; జూనియర్ మహిళల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. మౌనిక, 2. దివ్య; పురుషుల 50 మీ. రైఫిల్ త్రి పొజిషన్: 1. శ్రీనివాస్, 2. సందీప్, 3. రాజ్ కుమార్; పురుషుల 50 మీ. పిస్టల్: 1. జెన్హుల్ అబెదిన్, 2. ప్రసన్న కుమార్, 3. నిరంజన్; పురుషుల స్కీట్: 1. శ్రేయాన్ కపూర్, 2. ఆయుశ్ రుద్రరాజు, 3. చేతన్ రెడ్డి.