Somireddy(56)
-
సొమ్మిరెడ్డికి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
-
అక్కడికి వచ్చే దమ్ముందా?.. సోమిరెడ్డికి కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్మీట్ పెట్టిన వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇదే సమయంలో సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా?. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా?.సోమిరెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. తేదీ, సమయం చెబితే.. విజయ సాయిరెడ్డి, నేను వస్తాం.. ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా?. విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయింది’ అంటూ ఆరోపణలు చేశారు. -
సోమిరెడ్డి కలెక్షన్ ఆఫీస్.. సర్వేపల్లిలో దందాలే దందాలు
-
బాబూ.. ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్: మాజీ మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెడుతున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.కాగా, మాజీ మంత్రి కాకాణి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక అంతా భూటకమే.. వినియోగదారుడు మీద పెనుభారం పడుతుంది. పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకు ఇసుక విధానం తీసుకొచ్చారు. పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్ నుంచి రోజుకి 100 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణాను గ్రామస్తులే అడ్డుకున్నారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇలాకాలో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి అండదండలతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ప్రతీలోడ్కు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ టక్కులను రీచ్ వద్దనే వదిలేసి టీడీపీ నేతలు పరారు అయ్యారు. సహజ వనరులను టీడీపీ నేతలు దోచుకుంటుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్, మైనింగ్, ఎస్పీ పనిచేస్తున్నారా?. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వానికి ఏడాదికి 790 కోట్లు ఆదాయం వచ్చింది. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేది..సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నాడు జరగని అవినీతి జరుగుతుంది. దీని మీద చంద్రబాబు విచారణ జరిపిస్తే.. సోమిరెడ్డి బాగోతం బయటపడుతుంది. చంద్రబాబు ర్యాంక్లు ప్రకటిస్తే.. అవినీతిలో సోమిరెడ్డికి నంబర్ వన్ ర్యాంక్ వస్తుంది. దోపిడీని ఆపకపోతే గ్రామాలకు గ్రామాలు రోడ్డెక్కుతాయి. శాంతిభద్రతలకి విఘాతం కలుగుతుంది. ఇసుక దందాపై జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. -
ఎనిమిది మంది రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో ఇద్దరు.. సాక్షి నెట్వర్క్: అప్పులబాధతో తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన అలేటి సర్వేష్(39), ఇదే జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి శివారు రామన్నగూడెంకు చెందిన మిట్టపల్లి రాజు (30), కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం తిరుమలాపూర్కు చెందిన రైతు కల్లెం పెద్ద నాంపెల్లి(62), ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మం డలం పడమటితండాకు చెందిన కౌలురైతు భూక్యా బిక్కు (33), మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్కు చెందిన పెంటప్ప (35), రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బేగరి సదానందం (35), మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామానికి చెందిన అరికెల భిక్షపతి (50), ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మాటేగాంకు చెందిన కౌలు రైతు దిగంబర్ (40) బలవన్మరణాలకు పాల్పడ్డారు. కాగా, గుండెపోటు తో మరో ఇద్దరు రైతులు మృతి చెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన సోలిపురం సోమిరెడ్డి (56) మూడెకరాల్లో వరి సాగు చేశాడు. రుణ పరిమితిని పెంచేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించలేదు. పంట దిగుబడి కూడా అంతంతే వచ్చే అవకాశముంది. దీంతో రూ.5 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో నిద్రలోనే గుండెపోటుకు గురయ్యూడు. ఇదే మండలం కాటాపురానికి చెందిన ఎం.డి.గౌస్ అహ్మద్ (42) గత ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు. పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు.