మెట్రో రైలు ఎక్కిన సీనియర్ హీరోయిన్
సీనియర్ హీరోయిన్, ప్రముఖ సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఢిల్లీ మెట్రో రైల్లో సామాన్య ప్రయాణికురాలిలా వెళ్లారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి అత్యవసర పనిమీద వెళ్లేందుకు మెట్రో ఎక్కానని, అది చాలా శుభ్రంగా, బ్రహ్మాండంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. దాంతోపాటు తాను మెట్రోలో కూర్చుని ఉండగా సెల్ఫీ తీసుకున్న ఫొటో కూడా ఆమె ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అపర్ణాసేన్ దర్శకత్వంలో వస్తున్న సొనాటా సినిమాలో షబానా నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ముగ్గురు అవివాహిత మహిళలు మధ్యవయసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయం గురించిన చర్చ ఉంటుంది. ఒక ప్రొఫెసర్, ఒక బ్యాంకు ఉద్యోగిని, జర్నలిస్టు.. ఈ ముగ్గురు మహిళల చుట్టూనే సినిమా కథ తిరుగుతుంటుంది.
Travelling by Delhi Metro from airport to make it in time for an urgent appointment! Its SUPERB.. clean .! pic.twitter.com/m7U2xzRGwh
— Azmi Shabana (@AzmiShabana) 6 April 2017