యారాడలో షూటింగ్ సందడి
మల్కాపురం : ఎస్.వీ.ఎస్ క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ నంబర్–1 చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆదివారం యారాడ బీచ్లో జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి,దర్శుకురాలు విజయనిర్మల మనవడు,హీరో నరేష్ తనయుడు నవీన్ హీరోగాlనటిస్తున్నాడు. నటి శ్రావ్య, నవీన్ మధ్య ప్రేమ సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో నవీన్ తనకు ఇది రెండో చిత్రమని,తొలి సినిమా విడుదల కావల్సి ఉందన్నారు. తన తండ్రిలా చిత్రరంగంలో మంచి పేరుతెచ్చుకొంటానన్నారు. యారాడ బీచ్ ఎంతో సుందరంగా ఉందన్నారు.