జైపూర్‌కు మరో ఓటమి
జైపూర్: సొంత వేదికపై జైపూర్ పింక్ పాంథర్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 18-34 తేడాతో ఓడింది. బెంగాల్ నుంచి జంగ్ కున్ లీ ఆరు రైడింగ్ పాయింట్లు సాధించగా, జైపూర్ తరఫున సోనూ నర్వాల్ మూడు పాయింట్లు చేశాడు. 37 పాయింట్లతో ప్రస్తుతం బెంగాల్ రెండో స్థానంలో ఉంది.