Sony Xperia XA Ultra
-
మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా'
జపనీస్ టెక్ దిగ్గజం సోని, ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో భాగంగా తొలి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించేసింది. ఎక్స్పీరియా‘ఎక్స్ఏ అల్ట్రా’ పేరుతో ఆరు అంగుళాల ఫాబ్లెట్ను మంగళవారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.29,990గా కంపెనీ నిర్ణయించింది. అన్నీ సోనీ సెంటర్లు, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది. వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్, జూలై 27 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటు ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ చెప్పింది. ఎక్స్పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా ఫీచర్లు... 6 అంగుళాల 1080పీ డిస్ప్లే స్క్రాచ్-రెసిస్టెంట్ కర్వ్డ్ 2.5 డీ గ్లాస్ 2గిగాహెడ్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ6755 హీలియో పీ10 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎక్స్పీరియా యూఐ 3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నెల్ మెమరీ 200 జీబీ వరకు విస్తరణ మెమరీ డ్యూయల్ సిమ్ ఫోన్ 21.5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్మార్ట్ సెల్ఫీ ఫ్లాస్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ ఆప్షన్ 2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్) -
సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ ఏ అల్ట్రా' కమింగ్ సూన్
సోనీ ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో తొలి స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల కానుంది. సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్ఏ అల్ట్రా పేరుతో సోమవారం లాంచ్ కానుంది. 'పర్ ఫెక్ట్ సెల్పీ కాంపేనియన్' ను ఎక్స్ సిరీస్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఫోన్ ని సంస్థ తన వెబ్ సైట్ లో గత మేనేలలో ప్రవేశపెట్టింది. 'ఎక్స్ఏ అల్ట్రా ఫీచర్ల విషయానికొస్తే... ఆరు అంగుళాల టచ్ స్క్రీన్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 200 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 21.5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎక్స్ మోర్ ఆర్ఎ స్ సెన్సర్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ . 2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్). 10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటుపని చేస్తుందని కంపెనీ చెబుతోంది. 202 గ్రా. ల బరువు తూగే ఈ స్మార్ట్ ఫోన్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది అంచనా. ఈ ఫోన్ ధర, తదితర వివరాలు లాంచింగ్ సందర్భంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.