ఆఫ్ఘానిస్థాన్‌లో నలుగురు నాటో సైనికులు మృతి
దక్షిణ ఆఫ్ఘానిస్థాన్‌లో ఈ రోజు తెల్లవారుజామున తీవ్రవాద దళాలు, సంకీర్ణ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నాటో సైనికులు మృతి చెందారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. దేశంలో తీవ్రవాదుల ఎరివేతలో భాగంగా నాటో సంకీర్ణ దళాలు ఈ రోజు తెల్లవారుజామున సంకీర్ణదళాలు తనిఖీలు చేపట్టాయి.
ఆ క్రమంలో నాటో సంకీర్ణ దళాలపై తీవ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో నలుగురు సైనికులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆఫ్ఘాన్‌లో 140 మంది విదేశీ సైనికులు మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఆఫ్ఘాన్‌లో తీవ్రవాద ప్రభావిత ప్రాంతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన సంకీర్ణ దళాలు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.