బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు షాక్
ప్రిటోరియా: ప్రియురాలిని హత్య చేసిన దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు చుక్కెదురైంది. అతడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్ధించింది. 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు హత్యచేసినట్టు సాక్ష్యాలు బలంగా ఉండడంతో ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పు చెప్పారు. తలుపులోంచి తుపాకీ కాల్చి ప్రియురాలిని హతమార్చినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు.
దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో దోషులుగా తేలిన వారికి కనీసం 15 ఏళ్లు జైలు పడుతుంది. అయితే పిస్టోరియస్ అంగవైకల్యం, భావోద్వేగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అతడికి తక్కువ శిక్ష విధించాలని డిఫెన్స్ వాదించింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన సమయంలో పిస్టోరియస్ కోర్టులోనే ఉన్నాడు.
2013 సంవత్సరంలో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తన ప్రియురాలు రీవా స్టీన్క్యాంప్ను పిస్టోరియస్ కాల్చి చంపాడు. ఈ కేసులో అతడికి కింది కోర్టు ఐదేళ్లు జైలు విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించగా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. వాదనలు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన రెండు కాళ్లకు అమర్చిన బ్లేడ్స్ తీసేసి కోర్టు ముందుకు వచ్చాడు. తన రెండు కాళ్లు లేవని, తన వైకల్యం దృష్ట్యా జైలులో ఉండలేనని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. అతడి అభ్యర్థనలకు కోర్టు తోసిపుచ్చింది.