క్రికెట్ గ్రౌండ్లో కోచ్‌ల మృతదేహాలు..
ప్రెటోరియా: సౌతాఫ్రికాలోని సౌత్‌వెస్ట్ ప్రెటోరియాలోని లాడియమ్ క్రికెట్ స్టేడియంలో ఇద్దరి కోచ్‌ల మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. మృతదేహాలపై గాయాలను పరిశీలిస్తే ఎవరో హత్య చేసి చంపినట్లు తెలుస్తోంది. ఈఎస్పీన్ రిపోర్టుప్రకారం మృతులు గివెన్ ఎన్కోసి(24), చార్లసన్ మసెకో(26)గా గుర్తించారు. సౌతాఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఉదయం ప్రాక్టీస్‌కు వచ్చిన ఉమర్ అస్సద్ అనే క్రికెటర్ కోచ్‌లు మరణించనట్లు గుర్తించి, సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్టేడియంలోని క్లబ్ గదిలో మొత్తం నలుగురు కోచ్‌లు నివసిస్తుండగా మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా సౌతాఫ్రికా క్రికెట్ అనుబంధ కార్యక్రమాల్లో కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరి మృతి పట్ల సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సంతాపం ప్రకటించింది.