south coastal andhrapradesh
-
దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2.6, చిత్తూరు జిల్లా గుడిపాలలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
మరో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు
విశాఖపట్నం: ఉత్తర ఛత్తీస్గఢ్పై ఉపరితం ఆవర్తనం ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాంధ్రలో 24 గంటలపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే భారీ ఎండలకు తోడు వడగాల్పుల వల్ల తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 23 జిల్లాలలో 500 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.