దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు  | Moderate Rains In South Coast Andhra Pradesh | Sakshi

దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు 

Nov 6 2022 6:20 AM | Updated on Nov 6 2022 8:45 AM

Moderate Rains In South Coast Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుతం ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2.6, చిత్తూరు జిల్లా గుడిపాలలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement