south east asia
-
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
ఈ బనానా రంగు, రుచి సెపరేట్!
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’. ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు. నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్ నీలం రంగు బనానా. మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్ చేసి చూడండి. l -
ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’
సాక్షి, న్యూఢిల్లీ : ఒక్క భారత దేశాన్నే కాదు, ఆగ్నేయాసియాలోని వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలను కూడా ఈసారి డెంగ్యూ జ్వరలు తీవ్రంగా వణికిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు తెలియజేస్తున్నాయి. వియత్నాంలో ఒక్క జూలై నెల నాటికే 1,15,186 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 29 వేల డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈసారి లక్ష దాటి పోవడం గమనార్హం. ఫిలిప్పీన్స్‌లో జూలై నెల నాటికి 1, 46, 062 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది అదే ఫిలిప్పీన్స్‌లో 69 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌లో 43, 200 డెంగ్యూ కేసులు నమోదవడంతో ఆ దేశంలో వైద్య అత్యయిక పరిస్థితి ప్రకటించారు. అక్కడే గతేడాది జూలై నెల నాటికి 28,100 డెండ్యూ కేసులు నమోదయ్యాయి. కంపోడియాలో 39 వేల కేసులు, గతేడాది మూడు వేల కేసులు నమోదయ్యాయి. లావోస్, మలేసియా, సింగపూర్, తైవాన్ దేశాల్లో కూడా ఈసారి ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ఆగ్నేయాసియా దేశాల్లో కాకుండా అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అమెరికా దేశాల్లో కూడా డెంగ్యూ వ్యాధి ఎక్కువగానే ఉంది. ఈసారి బ్రెజిల్, కొలంబియా, హోండురస్, నికరాగ్వా దేశాల్లో ఆగస్టు మూడవ తేదీ నాటికి 5,84,263 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా 1970 దశకం నుంచే డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అత్యధిక జన సాంద్రతతో కిక్సిర్సిన రియో డీ జెనీరియో, ఓ చి మిన్ సిటీ నగరాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా జూలై నెలలో వాతావరణం వామ్ (వేడిగా) ఉండడమని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’కు చెందిన డాక్టర్ రాచెల్ లోవే తెలియజేశారు. భారత లాంటి సమశీతోష్ణ మండలాల్లో ఉష్ణోగ్రత సగటు 25 సెంటిగ్రేట్ డిగ్రీలు ఉంటే వామ్గాను, 35 డిగ్రీలు ఉంటే హాట్‌గాను పరిగణిస్తాం. మొత్తం అంతర్జాతీయంగా, అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎన్నడు లేని విధంగా (ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా నోట్ చేస్తున్న 1880 సంవత్సరం నుంచి) జూలై నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందట. ఈ వామ్ వాతావరణంలో డెంగ్యూ వైరస్, వాటిని క్యారీ చేసే దోమలు క్రియాళీలకంగా ఉంటాయని డాక్టర్ రాచెల్ తెలిపారు. మురుగు నీరు, కుంటలతోపాటు ప్లాస్టిక్ వాటర్ కంటెనైర్లు, మొక్కల కుండీలు దోమల గుడ్లకు నిలయాలుగా మారుతున్నాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. డెంగ్యూ వైరస్ సోకితే కళ్లలోపల మంట, జ్వరంతోపాటు విపరీతమైన తలనొప్పి వస్తుందట. ఫలితంగా మూత్రంలోకి రక్తం రావడం, శరీరంలోని అవయవాలకు ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగ్గా అందించలేక శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడడం, ఆక్సిజన్ అందక శరీరంలోని ఏదైన అవయం దెబ్బతింటుందని, కీళ్ల నొప్పులు వస్తాయని తెలిపారు. బీపీ కూడా తీవ్రంగా పడిపోతుందని, కొన్ని సందర్భాల్లో మత్యువు కూడా సంభవిస్తుందని డాక్టర్ రాచెల్ వివరించారు. దీన్ని నిరోధించేందుకు ఇప్పటి వరకు సరైన మందులేదని, మానవ శరీరంలో ప్రవేశించిన ఈ వైరస్ తన సైకిల్‌ను పూర్తి చేసుకొని బయటకు వెళ్లి పోయే వరకు శరీరంలోని ఏ అవయవం దెబ్బతినకుండా రక్షించుకోవడం, వాటి పరిరక్షణకు అవసరమైన మందులు తీసుకోవడం మంచిదని ఆయన చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల డెంగ్యూ కేసులు నమోదయినాయని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో 2005లో అత్యధికంగా 15 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
రోజుకు 7,400 మంది శిశువుల మృత్యువాత
న్యూఢిల్లీ: ఆగ్నేయాసియా ప్రాంతంలో శిశుమరణాలు నానాటికి పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజు 7,400మంది అప్పుడేపుట్టిన శిశువులు మృత్యువాత పడుతున్నారని అది పేర్కొంది. వీటి నివారణను అత్యవసర పరిస్థితిగా తీసుకోకుంటే ఆందోళనకరంగా మారనుందని హెచ్చరించింది. అసలు ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలియక తల్లులకు, కుటుంబాలకు తీరని వేదనగా మారాయని, వీటిపై దృష్టిసారించాలని సూచించింది. ముందస్తు జాగ్రత్తలతో వీటిని 2/3శాతానికి తగ్గించవచ్చని ఆగ్నేయాసియా దేశాలకు సలహా ఇచ్చింది. బంగ్లాదేశ్, భుటాన్, కొరియా, భారత్, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి మొత్తం పదకొండు దేశాలు ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్నాయి. ఈ దేశాల్లో గర్భంతో ఉన్న తల్లి పోషకాహారం తీసుకోకపోవడంతోపాటు డెలివరీ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల, జన్మించిన తొలిరోజుల్లో కూడా పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించడం వల్ల అనూహ్య మరణాలు సంభవిస్తున్నాయని, వీటిపై ప్రజల్లో అవగాహనను ఒక అత్యవసర కార్యక్రమంగా భావించి కల్పించడం ద్వారా శిశుమరణాలు తగ్గించవచ్చని ఆగ్నేయాసియా ప్రాంతాల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.