‘యువత మంచి నాయకులుగా ఎదగాలి’
- నాగలాండ్‌లో ప్రారంభమైన యువజనోత్సవాలు
కోహిమా: ఈశాన్య రాష్ట్రాల యువజనోత్సవాలు గురువారం కోహిమాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌కుమార్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈశాన్య రాష్ట్రాల జాతీయ సేవా పథకం గౌహతీ రీజినల్ డెరైక్టర్ ఎ్స్కే బసుమతరి మాట్లాడుతూ రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్ఎస్ఎస్కు కేంద్రం పూర్తి శాతం నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 70శాతం నిధులు కేంద్రం నుంచి 30శాతం నిధులు రాష్ట్రాల నుంచి ఎన్ఎస్ఎస్కుకేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ యువజనోత్సవాల్లో పాల్గొనడానికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఇంతవరకు ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో 11 యువజనోత్సవాలుజరగగా నాగలాండ్ లో రెండోసారి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.