‘గ్రౌండ్’వర్క్ పూర్తి
సీఎస్ఏ సౌత్ ఇండియా స్పోర్ట్సమీట్కు ఖమ్మంలోని గుట్టలబజార్ సెయింట్ జోసెఫ్ పాఠశాల క్రీడా మైదానం ముస్తాబవుతోంది. ఈనెల 21,22,23 తేదీల్లో జరుగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన 17 ఉన్నత పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 1,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. వీరికి పాఠశాలలోనే భోజనం, వసతి కల్పించనున్నారు. ఈ పోటీలు ఆరు అంశాల్లో జరగనున్నాయి. సీనియర్ బాలబాలికలు, జూనియర్ బాలబాలికలు విభాగంలో నిర్వహించనున్నారు. సీనియర్ బాలబాలికల విభాగంలో బాస్కెట్బాల్, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి.
సీనియర్ బాలుర విభాగంలో కబడ్డీ, బాలికల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్ బాలబాలికల విభాగంలో ఖోఖో, అథ్లెటిక్స్లోని 100మీ, 200మీ పరుగుపందెం పోటీలు జరుగుతాయి. బాలురకు మాత్రమే కబడ్డీ పోటీలు నిర్విహ స్తారు. ఈ టోర్నీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాఠశాల ఉపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ ఎన్.నక్షత్రం, ముఖ్య పర్యవేక్షకులుగా పాఠశాల సీనియర్ పీఈటీ శివారెడ్డి వ్యవహరిస్తున్నారు.