South Indian Film Awards
-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్‌లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్‌స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
‘సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019’
-
కనుల పండువగా సంతోషం
‘సంతోషం’ సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, ‘సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ 2019’ ప్రదానోత్సవం హైదరాబాద్‌లో కనుల పండువగా జరిగింది. సురేష్ కొండేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, నృత్యాలు, సరదా స్కిట్లు హైలైట్‌గా నిలిచాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువురికి అవార్డులు అందించారు.65 సంవత్సరాలు సినీ జీవితం పూర్తయిన సందర్భంగా నటి జమున ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేశ్ బాబు ఈ అవార్డు అందించారు. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరికి ఫిల్మ్ జర్నలిజంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ‘మహానటి’కిగాను ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్టు అవార్డును రాజేంద్రప్రసాద్, అదే చిత్రంలో చిన్నప్పటి సావిత్రిగా నటించిన సాయి తేజస్విని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును అందుకున్నారు. సీనియర్ నటి ప్రభ లెజెండరీ యాక్ట్రెస్ అవార్డును, అల్లు రామలింగయ్య అవార్డును ‘వెన్నెల’ కిశోర్ అందుకున్నారు. డి. రామానాయుడు స్మారక అవార్డును నిర్మాత ‘దిల్’ రాజు అందుకున్నారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి ఉత్తమ హాస్యనటునిగా సునీల్, ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాంకీ, పృథ్వీరాజ్ ఆత్మీయ పురస్కారం అందుకున్నారు. ‘రంగస్థలం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డును సుకుమార్ సతీమణి తబిత అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును విశ్వక్సేన్, ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి కార్తికేయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. శ్రీదేవి స్మారక అవార్డును శ్రియ అందుకున్నారు. ‘అరవింద సమేత’ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్ అవార్డును తమన్ అందుకున్నారు. వీరితో పాటు మరికొంత మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆ ఘనత మాదే: సురేష్ కొండేటి
30న ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక సాక్షి, సిటీబ్యూరో: గత పదకొండేళ్లుగా ‘సంతోషం’ ఫిల్డ్ అవార్ట్స్ వేడుకను వైభవంగా నిర్వహిస్తున్న తాము 12వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు వేడుక మరింత ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని ‘సంతోషం’ సినీ వార పత్రిక అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ నెల 30న జరగనున్న ఈ వేడుక కర్టన్రైజ్ కార్యక్రామం ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలో సినీ తారలు ప్రణీత, హంసా నందిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్..‘దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఏ భాషలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ అవార్డులు నిర్వహించిన పత్రిక లేదు. ఆ ఘనత మా పత్రికకే చెందుతుంది. ఇన్నేళ్లుగా చలన చిత్ర పరిశ్రమ పెద్దల ఆదరాభిమానాలతో అవార్డులు అందజేస్తూ వచ్చాను. ఈ ఏడాది జేఆర్సీ కన్వెషన్లో జరపనున్న వేడుకలో పలువురు చిత్రరంగ ప్రముఖులు పాల్గొంటారు’ అని చెప్పారు. గత ఏడాది ఓ కన్నడ చిత్రానికిగాను ‘సంతోషం’ అవార్డు అందుకున్నానని, తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ ఈ ఏడాది నామినీగా నిలవడం ఆనందంగా ఉందనీ ప్రణీత తెలిపారు. నాలుగు భాషల వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం అనీ, నేను నటించిన రెండు చిత్రాలు పోటీలో ఉన్నాయని హంసా నందిని అన్నారు.