కాళహస్తిలో రజనీ కుమార్తె పూజలు
కాళహస్తి: ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య బుధవారం శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చిత్రం విజయవంతం కావాలని చిన్న కుమార్తె సౌందర్య ఇవాళ ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది...సౌందర్య రజనీకాంత్‌కు స్వాగతం పలికి, రాహుకేతు పూజలు చేయించారు.
స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. కాగా భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు. మరోవైపు సినిమా విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.