ప్రణాళికాబద్ధంగా ఎన్నికలు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపట్టాల్సిన పోలీస్ బందోబస్తు, వెబ్ కాస్టింగ్ కోసం నెట్వర్క్ కనెక్టవిటీ, ఈవీఎంల సరఫరా, కౌంటింగ్ కేంద్రాలలో స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటుపై ఆరా తీశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు విషయమై చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో నెట్వర్క్ కనెక్టవిటీ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు వివరాలను వివరించారు. కార్యక్రమంలో ఏజేసీ షరీఫ్, డీఆర్వో నూర్‌బాషా ఖాసీం, రిటర్నింగు అధికారులు జి.గణేష్‌కుమార్, ఎ. శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.