పేకాటరాయుళ్లపై కఠిన చర్యలు
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: వచ్చే దీపావళి పండుగ నేపథ్యంలో ఎవరైనా పేకాట అడితే..ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని జిల్లా ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం తాండూరు రూరల్ కార్యాలయం(కరన్‌కోట్ పోలీస్‌స్టే షన్)లో ఆమె నాలుగు మండలాల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దీపావళి పండుగకు ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీలు చేపడతామన్నారు. తాండూరు రూరల్ సర్కిల్లో నేరాలు తగ్గాయని, హత్యలు పెరిగాయని చె ప్పారు. 2013 సంవత్సరంలో వార్షిక తనిఖీల్లో భాగంగా రూరల్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. నాలుగు మండలాల్లో కలిపి 2011 సంవత్సరంలో 11 హత్యలు, 2012లో 10, 2013 ప్రస్తుతం అక్టోబర్ వరకు 15 హత్య కేసులు నమోదయ్యాయన్నారు.
ఈ సంవత్సరం 11 హత్య కేసులు రూరల్ సీఐ రవి ఛేదించారని, 4 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే రూరల్ సర్కిల్లో రోడ్డు ప్రమాదాలు 2011 సంవత్సరంలో 74 (కేసులు), 2012లో 79, 2013( ప్రస్తుతం)- 52 కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. దారి దోపిడీ 2 కేసులు నమోదయ్యాయని అందులో ఒక కేసు ఛేదించి రూ.21 వేలు, 1సెల్ ఫొన్ రికవరి చేశామని చెప్పారు. రాత్రి పూట దొంగతనం కేసుల్లో 30 శాతం రీకవరి చేశామని ,70 శాతం రికవరీ అలాగే ఉందన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచామని చెప్పారు. మట్కా కేసులో ఓ వ్యక్తిపై రెండో కేసు నమోదైతే అతనిపై రౌడీ షిట్ తెరుస్తామని ఆమె హెచ్చరించింది. వికారాబాద్ డివిజన్‌కు శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ 109 మంది వచ్చారని చెప్పారు.
ఏమైనా సమస్య ఉంటే ‘100’కు ఫోన్ చేయండి
గ్రామాల్లో, పట్టణాల్లో ఎమైనా గొడవలకు సంబంధించిన సమస్యలు , భార్యా భర్తల మధ్య గొడవ, ఈవ్ టీజీంగ్, పేకాట, మట్కా ఇలాంటి పోలీసుల అవసరం ఉన్నదనిపిస్తే చాలు 100 నంబర్‌కు డయల్ చేయాలని ఎస్పీ రాజకుమారి ప్రజలకు సూచించారు. 108 మాదిరిగానే స్పందిస్తామని చెప్పారు. పోలీసులు స్పందించకపోతే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.
బెల్టు షాపులపై కఠిన చర్యలు
గ్రామాల్లో గొడవలకు దారి తీస్తున్న బెల్టు షాపులపై దాడు చేస్తామని ఆమె హెచ్చరిం చింది. గ్రామాల్లో దాడులు జరపాలని డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌ను ఆదేశించారు. అలాగే మండల పరిధిలోని రాజీవీర్ ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎస్పీని కోరారు. త్వరలోనే గ్రామాల్లో మూఢనమకాలపై చైతన్య సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. అక్రమంగా ఎవరైనా నాపరాతి గనుల్లో బ్లాస్టిం గ్‌కు పాల్పడితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, కరన్‌కోట్ ఎస్ఐ పవన్, యాలాల ఎస్ఐ రాజేంధర్రెడ్డిలు ఉన్నారు.