కాలయాపన కమిటీలు!
కమలనాథన్ కమిటీ, ప్రత్యూష సిన్హా కమిటీ.. ఇంతవరకు ఈ రెండు కమిటీలూ అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా రెండు రాష్ట్రా ల ఉద్యోగుల విభజనపై నివేదిక ఇవ్వలేదు. డిసెంబర్లో అని మార్చిలో అని, ఎప్పటికప్పుడు కాలయాపన చేయడం తప్ప ఇంతవరకు ఇవి ఒరగబెట్టిందేమీ లేదు. దీనికి తోడు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు మాట్లాడితే ఢిల్లీ పోవడం, రావడం, అభ్యంతరాలు చెప్పడంతోటే సరిపో యింది. ఇలా ప్రజాధనం ఖర్చు చేయడం ఏలిన వారికి ఎంతవరకూ సమంజసం? ఒక పక్క ప్రజా ధనం పొదుపుగా వాడాలని మన నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతుంటారు కదా. మరి అవి అధికారులకు వర్తించవా? ఐఏఎస్ అధికారుల కేటాయిం పు, రెండు రాష్ట్రాల ఉద్యోగుల కేటాయింపు రెండూ నత్త నడకే.
దీంతో కింది నుంచి పైస్థాయి వరకు అధికారులలో అసంతృప్తి చోటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ పనులు నత్తనడకకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రెండు కమిటీలు తమ నివేదికలు వీలైనంత త్వరగా పూర్తి చేసి అధికారుల విభ జన చేసి ఇరురాష్ట్రాల అభివృద్ధికి దోహదపడేలా సహకరించాలి.
ఎస్. పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్