Spanish football
-
అందరూ చూస్తుండగా బట్టలు విప్పి రచ్చరచ్చ చేసిన స్టార్ ఫుట్‌బాలర్
ప్రత్యర్ధి జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా తనపై అభిమానంతో మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు క్రొయేషియన్ స్టార్ ఫుట్‌బాలర్ ఇవాన్ రాకిటిక్ తనదైన స్టైల్లో థ్యాంక్స్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోనే బట్టలు విప్పి ప్రత్యర్ధి జట్టు అభిమానులకు ఇచ్చేశాడు. అనంతరం అండర్‌వేర్‌తోనే మైదానం మొత్తం తిరుగుతూ స్టాండ్స్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. 📹 Rakitic gives his shirt and shorts to fans after the game #BarçaSevilla ⏩ @GolagolE3 pic.twitter.com/pfXUpmcsVX — FCBarcelonaFl (@FCBarcelonaFl) April 4, 2022 ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా బార్సీలోనా-సెవిల్లా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బార్సీలోనా 1-0 తేడాతో విజయం సాధించింది. బార్సిలోనా తరఫున పేద్రీ 72వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పెద్రీతో పాటు సెవిల్లా ఆటగాడు ఇవాన్ రాకిటిక్ కూడా హీరో అయ్యాడు. తన జట్టు ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరు కనబర్చి ప్రత్యర్ధి జట్టు అభిమానుల మద్దతు చూరగొన్నాడు. చదవండి: దుమ్మురేపుతున్న టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే -
ఆ గే రిఫరీ హర్టయ్యాడు
మాడ్రిడ్: తొలిసారి స్పానిష్ ఫుట్ బాల్ రిఫరీగా ఎంపికైన స్వలింగ సంపర్కుడు(గే) జీసస్ టొమిలెరో తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వరుసగా అవమానాలు ఎదురవుతుండటంతో రెండు నెలల్లోనే ఆ ఉద్యోగానికి బైబై చెప్పేశారు. క్రీడాకారుల నుంచి మద్దతుదారుల నుంచి వరుసగా వేధింపులు, అవమానాలు ఎదురవ్వడం వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఈ సందర్భంగా జీసస్ చెప్పారు. అండల్సియాన్ లో పోర్చుగీస్ వర్సెస్ శాన్ ఫెర్నార్డో ఇస్లెనో మధ్య జరిగిన అండర్-19 మ్యాచ్ లో ఓ క్రీడాకారుడికి తాను పెనాల్టీ విధించిన తర్వాత కొంతమంది దారుణంగా తిట్టి అవమానించారని.. చుట్టూ ఉన్నవారంతా నవ్వారని, అది తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. 11 ఏళ్ల నుంచి రిఫరీగా పనిచేస్తున్న జీసస్ టొమిలెరో.. కొద్ది నెలల కిందటే తాను గేనని బహిరంగంగా చెప్పాడు. అప్పటి నుంచి తీవ్ర అవమానాలు ప్రారంభం కావడంతో విధులకు గుడ్ బై చెప్పాడు.