SPARC
-
భారీ నష్టాల్లో స్పార్క్ - ఏకంగా..
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ సంస్థ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్(స్పార్క్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం పెరిగి రూ. 82 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 71 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25 కోట్ల నుంచి రూ. 48 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 97 కోట్ల నుంచి రూ. 140 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 223 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 203 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 137 కోట్ల నుంచి రూ. 239 కోట్లకు జంప్ చేసింది. -
స్పార్క్- పీఐ ఇండస్ట్రీస్.. లాభాల స్పార్క్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్ అరౌండ్ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇదే కాలంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆగ్రి కెమికల్స్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో సన్ ఫార్మా అడ్వాన్స్డ్ దాదాపు రూ. 57 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 94 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 971 శాతం జంప్‌చేసి రూ. 185 కోట్లను తాకింది. ఈ కాలంలో గత నష్టాల నుంచి బయటపడుతూ రూ. 61 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇబిటా మార్జిన్లు 5.8 శాతం ఎగసి 32.8 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత స్పార్క్ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 200కు చేరింది. ప్రస్తుతం 8.3 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. పీఐ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పీఐ ఇండస్ట్రీస్ నికర లాభం 43 శాతం వృద్ధితో రూ. 146 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 41 శాతం పెరిగి రూ. 1060 కోట్లకు చేరింది. ఇబిటా 55 శాతం అధికంగా రూ. 236 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత పీఐ ఇండస్ట్రీస్ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1,960కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.5 శాతం జంప్‌చేసి రూ. 1,900 వద్ద ట్రేడవుతోంది. -
షీలా పటేల్ కు కీలక పదవి
న్యూయార్క్: పద్మశ్రీ అవార్డు గ్రహిత, స్పార్క్ (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్) వ్యవస్థాపకురాలు షీలా పటేల్ ‘ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన’ కమిటీకి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పట్టణ మురికి వాడలపై అధ్యయనం చేసి ఈ కమిటీ నివేదికను ఇవ్వనుంది. ముంబైకి చెందిన షీలా 1984 నుంచి పట్టణాల్లో ఉండే మురికి వాడల నిర్మూలనకు కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మురికివాడల్లో ఉన్న స్త్రీలను ఏకం చేసిన కార్యక్రమం ‘మహిళ మిలన్’తో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆసియా, ఆఫ్రికాలో ఉన్న మురికి వాడలకు సౌకర్యాలు కల్పించే స్వచ్ఛంద సంస్థ ‘స్లమ్ డ్వెల్లర్ ఇంటర్నేషనల్’ (ఎస్డీఐ)కి ఆమె ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. ‘మనం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ శైలికి అలవాటు పడిపోయాం. ఎందుకుంటే ఇప్పటికే ప్రపంచంలో సగం వరకు జనాభా నగరాలకు వలసవెళ్లింది. అందరికి సమాన అవకాశాలు కల్పించాలి. 2016లో ఈక్వెడార్ జరిగిన సమావేశాల్లో తీసుకున్న పట్టణాల్లో అందరికి ఇళ్లు, సమ్మిళిత వృద్ధి విధానానికి షీలా ఆధ్వర్యంలోని కమిటీ పనిచేస్తుంది’ అని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటానియో గ్లుటెరస్ అన్నారు. షీలా ప్రఖ్యాత రాక్ఫెల్లర్ నాయకత్వ అవార్డును గతంలో అందుకున్నారు.