ఇకపై తక్కువగా మాట్లాడతా: సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన రేప్ వ్యాఖ్యలపై స్పందించాడు. తనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇకపై చాలా తక్కువగా మాట్లాడతానని అన్నాడు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రారంభ సమావేశంలో సల్మాన్ మాట్లాడుతూ తాను ఎక్కువ సమయం తీసుకుని.. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అన్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ సుల్తాన్ సినిమా షూటింగ్ అయిన తర్వాత తన పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్ క్షమాపణ చెప్పాలని రాజకీయ పార్టీలు, జాతీయ మహిళా కమిషన్ భగ్గుమన్నాయి. పలువురు హీరోయిన్లు కూడా సల్మాన్ వ్యాఖ్యలను ఖండించారు.